Breaking News

పిడిఎస్ బియ్యం తో పలు వంటకాలు

– సంప్రదాయ వంటకాలు ప్రదర్శించిన 50 మహిళా బృందాలు
-ప్రతినెలా పిడిఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.846 కోట్లు ఖర్చు చేస్తుంది.
-వంటల కార్యక్రమంలో పాల్గొన్న 50 బృందాలకు రు.1000 చొప్పున నగదు బహుమతి ప్రకటించిన ఎమ్మెల్యే రాజా
-కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్ననాణ్యమైన పీడీఎస్ బియ్యాన్ని లబ్దిదారులకు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ కమీషనర్ హెచ్. అరుణ్ కుమార్ పేర్కొన్నారు.స్థానిక ఎంపిడివో కార్యాలయం లో ఆదివారం ఉదయం పిడిఎస్ బియ్యంతో పలు వంటకాలు కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పౌర సరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అందచేస్తున్న బియ్యం నాణ్యత విషయం, తీసుకుని వెళ్ళే క్రమంలో ఇబ్బందులు, ధర విషయం పై అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పిడిఎస్ బియ్యం నాణ్యత కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసి పోర్ట్ఫైడ్ బియ్యం అందిస్తున్నామన్నారు.రాష్ట్ర పరిధిలో రేషన్ కార్డుదారులకి నాణ్యమైన బియ్యం ఉచితముగా పంపిణీ చేయుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న ఒక నెలకు రేషన్ కార్డులు మొత్తం ఒక కోటి 46 లక్షల మందికి గాను 2,11,511 టన్నుల బియ్యంను రూ. 846 కోట్లు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు, కిలో రు. 40/- లు ఖరీదు గల బియ్యాన్ని లబ్దిదారులైన ఏ ఏ వై కార్డు దారులకు ఉచితంగాను, రైస్ కార్డు దారులకు కిలో రూ.1/- ప్రభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణి చేస్తోందని ఈ బియ్యాన్ని లబ్దిదారులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 1,64,000 మందికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడం జరుగు తోందని అరుణ్ కుమార్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 4 వేల మంది కి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో 84 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారన్నారు. ఇందుకు ముఖ్య కారణం ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనం కోసం అని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే బియ్యం అత్యంత పోష్టికాహరము తో కూడినదని, ఆ మేరకు గ్రామ స్థాయి లో వంటల కార్యక్రమం నిర్వహించేందుకు శాసన సభ్యులు ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.పిడిఎస్ బియ్యాన్ని దళారులు కొనుగోలు చేసిన విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని బహిరంగ మార్కెట్ లో పోలిష్ చేసి అమ్ముతున్నారన్నారు. అటువంటి వారిపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు మిల్లర్ల ను బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు తెలిపారు. రానున్న సీజన్లో ఇకపై నేరుగా రైతుల నుంచి కంది గింజలు కొనుగోలు చేసి ప్రజా పంపిణీ ద్వారా అందజేస్తామని తెలిపారు.జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ ఈ వంటల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం జరుగుతోందని అన్నారు. సార్టెక్స్ట్ బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దకే అందించేందుకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చెయ్యడం జరిగిందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా పైలేట్ ప్రాజెక్ట్ గా పిడిఎస్ బియ్యంతో వంటకాలు కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. పోర్టిఫైడ్ రైస్ కలిపి నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని, వాటిని అమ్ముకోకుండా వాడుకోవాలని కోరారు. అదేవిధంగా జిల్ల పరిధిలో రేషన్ కార్డుదారులకి నాణ్యమైన బియ్యం ఉచితముగా పంపిణీ చేయుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో వెచ్చిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో 5, 64, 571 రేషన్ కార్డు దారులకు పంపిణీ కాబడుచున్న బియ్యం కోసం సబ్సిడీ భారం రూ. 31, 73, 61, 360/- భరిస్తూ లబ్దిదారులకు 7934.034 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు.శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పిడిఎస్ బియ్యం ఉద్దేశ్యాన్ని అపహస్యము చేసేలా కొందరు ప్రయత్నం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విధానాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్దకే ప్రజా పంపిణీ వ్యవస్థ చేపట్టడం జరిగిందన్నారు. నియోజక వర్గంలో తొలి సారి ఏర్పాటు చేసిన పిడీఎస్ బియ్యంతో వంటకాలు కార్యక్రమాన్ని నియోజక వర్గ పరిధిలో ప్రతి గ్రామంలో చేపట్టడం ద్వారా మరింత అవగాహన కల్పించడంలో తమ వంతు ప్రయత్నం చేస్తానని జక్కంపూడి రాజా తెలిపారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ 50 బృందాలు 45 రకాల బియ్యంతో చేసే వంటకాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగిందన్నారు. ఇందులో 100 మంది మహిళలు పాల్గొనడం జరిగిందన్నారు. పిడీఏస్ బియ్యాన్ని అందించేందుకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం 846 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం మంచి పోష్టి కాహరం కలిగిన పోర్టిఫైడ్ బియ్యం అందిస్తోందని అన్నారు.ఈ సందర్భంగా వంటల పోటీలో విజేతులైన పిడిఎస్ బియ్యం తో పలు రకాల వంటలు నిర్వహించిన వారిలో విజేతలగా నిలిచిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ ప్రైజ్ లను రాష్ట్ర హోరు సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ బర్త్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు.ఈ సందర్బంగా వంటల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి ప్రధమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు, తృతీయ బహుమతిగా రూ.2,500/-లు కమీషనరు అరుణ్ కుమార్, జిల్లా కలెక్టరు మాధవీలత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా చేతులు మీదుగా అందజేశారు.ప్రథమ బహుమతి.. కరివేపాకు రైస్ :-నందరాడ గ్రామం కు చెందిన జే వేణు, వెంకటరత్నంలకు రు. 10 వేల రుపాయులు అందజేశారు.ద్వితీయ బహుమతి.. తాటి గారెలు:-జి.ఎర్రం పాలెం కు చెందిన.. కే.లక్ష్మి దుర్గకు రు. 5వేల రూపాయలు అందజేశారు.తృతీయ బహుమతిగా…రవ్వ పులిహోరకు, పాల ముంజెలకు :-కలవచర్ల గ్రామానికి చెందిన.. తవ్వ లక్ష్మి, ముద్దాడ లక్ష్మి లకు వై సుజాత, ఎన్ వెంకట్ లక్ష్మిలకురు. 2500/-లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఏ . చైత్ర వర్షిణి, ఇంఛార్జి డి ఎస్ వో విజయ భాస్కర్, డి ఎం మార్కెటింగ్ ఏ. కుమార్, మండల కన్వీనర్ దూలం పెద్ద, జడ్పిటిసి వాసంశెట్టి పెద్ద వెంకన్న,మందారపు వీర్రాజు సీతారత్నం, సర్పంచుల సంఘం అధ్యక్షులు కోలపాటి వెంకన్న,వేమగిరి కృష్ణ, గంగిశెట్టి సోమేశ్వరరావు,రాజానగరం సర్పంచ్ కుందేటి ప్రసాద్, కొల్లి వీర్రాజు,ప్రగడ చక్రి,అడబాల దుర్గారావు, వెలుగు బంధ కాము, తహశీల్దార్ పవన్ కుమార్, పిడి డిఆర్డిఎ ఎస్. సుభాషిణి, డి ఎల్ డివో పి. వీణా దేవి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *