-సమాచారం ఇచ్చిన వారికి రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు నగదు పారితోషికం
– స్వచ్ఛంద సంస్థలు సమాచారం అందిస్తే ఆ పారితోషకం వారికే అందజేస్తాం
-ఎన్ జి వో లు, ప్రభుత్వ అధికారులతో క్షేత్ర స్థాయి లో బృందాలు
-సామాజిక బాధ్యతగా మీడియా మాధ్యమాలు ద్వారా విస్తృత ప్రచారం
-రానున్న రెండు నెలల్లో స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ, వసతి గృహాల స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
– కలెక్టర్ కె .మాధవీలత
– ఎస్పీ సుధీర్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలను వినియోగాన్ని పూర్తి స్థాయి లో అరికట్టడం కోసం సమిష్టిగా పని చేద్దామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఎస్పీ సి హెచ్ సుధీర్ కుమార్ రెడ్డి లు పిలుపునిచ్చారు.సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత , ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ అధ్యక్షతన 3వ జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్ తగ్గింపు (ఎన్‌సీఓఆర్‌డీ) కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ డ్రగ్స్ దుర్వినియోగదారుల సంఖ్యను తగ్గించడానికి జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఎస్పీ గారు పేర్కొన్న విధంగా వినియోగించే వారికి నమ్మకం, భరోసా ఇచ్చే క్రమంలో నమ్మకం కలిగించి, సమగ్ర సమాచారం సేకరించడం ద్వారా సరఫరాకు చెందిన వివరాలు రాబట్ట గలుగుతామని అన్నారు. రొటీన్ కేసెస్ తప్ప సమాచారం అందించేందుకు కేసులు చాలా తక్కువుగా వున్నాయని పేర్కొన్నారు.డ్రగ్ డిటెక్షన్ సెంటర్ మరియు అడిషనల్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ , ఇతర శాఖలు సమర్ధవంతంగా పని చేస్తే తప్పకుండా సానుకూల ఫలితాలు పేర్కొన్నారు. ఆ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ, వసతి గృహాల స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో పాటు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు కార్యాచరణ సిద్దం చేసేందుకు ఎస్ ఈ బి, ఫారెస్ట్, పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.గంజాయి, మాదక ద్రవ్యాలను పండిస్తున్న, రవాణా చేస్తున్న వారి వివరాలు తెలియ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నగదు పురస్కారం కింద రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు అందిస్తామన్నారు.స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయడం ద్వారా తప్పకుండా చక్కటి ఫలితాలు కలుగుతాయని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసు అధికారులకు మాదక ద్రవ్యాలు వినియోగించే వారి వివరాలు డీ ఎడ్డిక్షన్ సెంటర్ ద్వారా అందచేస్తే, తదుపరి తీసుకునే చర్యలు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ఆ దిశలో రవాణా వ్యవస్థ, ఎవ్వరూ వీటిని అమ్ముతున్నారు, ఎవ్వరూ వినియోగిస్తున్నారు అన్న ప్రతి ఒక్క చిన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తామని అన్నారు. శాఖల మధ్య సమన్వయం ఉంటే తప్పకుండా జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు.ఇటీవల అక్రమ మాదక ద్రవ్యాలకు పాల్పడుతున్న నలుగురిని కూడా అరెస్టు చేశామన్నారు. మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు జిల్లాలోని రహదారి మార్గాల ఎంట్రీ పాయింట్ల వద్ద ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆమేరకు నియంత్రణ చెయ్యడం ద్వారా 10 కేజీల సరుకు సిజ్ చేశామన్నారు. రైల్వే అధికారులు మరింత నిఘా పెంచాలని పేర్కొన్నారు. వీటికి బానిస అయిన వారి పై నిరంతర నిఘా ఉంటాయనీ, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ బాధ్యతలను కూడా చేపట్టడం జరుగుతుందన్నారు.నషా విముక్తి భారత్ కింద జిల్లాల్లో డ్రగ్స్ వినియోగం నిర్మూలన కోసం విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో జిల్లా డిఫరెంట్లీ ఎబిల్డ్, ట్రాన్స్‌లింగు & సీనియర్ సిటిజన్స్ (వికలాంగుల) సంక్షేమం శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పునరావాస కేంద్రాలు ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారుఈ సమావేశంలో ఎస్ ఈ బి అధికారి పి. సోమ శేఖర్, జిల్లా ఫారెస్ట్ అధికారి బి. నాగరాజు, ఎన్ఫోర్స్ మెంట్ సూపరింటెం డెంట్ ఎం. రాంబాబు, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, డి పి ఆర్ వో ఏం ఎల్ ఆచార్యులు,డిఈవో ఎస్. అబ్రహం, ఆర్టీసి డిఎం ఎస్కే షబ్నం, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, సంక్షేమ శాఖ అధికారులు బి. రవికుమార్, బి రమేష్, కేఎస్ జ్యోతి, పోలీసు అధికారులు కే. శ్రీనివాసులు, వి అప్పారావు, పి. లోవ రాజు, నాటో ఇంటిల్జెన్స్ పోలీస్ అధికారి ఎస్పీ నక్వి, ఆర్ ఐ ఓ ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం, డి డి డబ్ల్యూ ఓ (దివ్యంగుల) బి. రవి కుమార్, డ్రగ్స్ అధికారిణి నాగమణి, జీ హెచ్ సైకాలజిస్ట్ డా ఎస్. నీలిమ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News