-భవనాలు అందజేసేందుకు పూర్తి లక్ష్యాల సాధనకు కృషి చెయ్యాలి
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనులు పూర్తి చెయ్యడం సమాంతరంగా పనులు చేపట్టాలని, ఎప్పటి కప్పుడు ఆయా పనులకు చెందిన బిల్లులు అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలతఆదేశించారు.సోమవారం ఉదయం కలెక్టరేట్ లో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ప్రాధన్యత భవనాల నిర్మాణ పనులు, అప్పగింత పై మండల వారీగా, నియోజక వర్గాల వారీగా కలెక్టర్, పీ ఆర్ ఎస్ ఈ – ఎ బి వి ప్రసాద్ తో కలిసి సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రాధాన్యత భవనాలు నిర్మాణ పనులు పూర్తి అయి ముగింపు దశకు చేరుకున్న వాటికి చెందిన తుది మెరుగులు దిద్దే పనిలో మరింత నిబద్దత చూపాల్సి ఉంటుందన్నారు.భవనాల నిర్మాణం పూర్తి అయినా కిటికిలు, తలుపులు , పెయింటింగ్, ఫ్లోరింగ్ పనులు పూర్తి కాకపోవడం వల్ల వాటిని అంద చేయ్యక పోవడం పై వ్యక్తిగత బాధ్యత తీసుకుని అందచేయాలని స్పష్టం చేశారు.పనులను సకాలంలో పూర్తి చేయ్యాని, మెటీరియల్ ను దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్ల విషయంలో నివేదిక అందజేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిఆర్ అధికారులు సమర్పించిన చెల్లింపు తాలూకా బిల్లులను ఉపాధి హామీ ఏ పి ఓ లు ఎప్పటికప్పుడు అప్లోడ్ చెయ్యాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డ్వామా పిడి ని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసిన వాటిని పూర్తి స్థాయి లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జిల్లాలో జీ ఎస్ భవనాలు 141 నిర్మాణం పూర్తి చేసి ఉన్నా ఇంకా వాటిలో పూర్తి పనులు 141 కి గాను జూలై 21 నాటికి 71, జూలై 31 కి 70 భవనాలు అందచెయ్యల్సి ఉందన్నారు. అదేవిధంగా అర్భికే భవనాలు 138 కి గాను 69 జూలై 21 కి, మిగిలిన 69 జూలై 31 నాటికి అందచేయాలని అన్నారు. వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాలు జూలై 21 నాటికి 22, జూలై 31 నాటికి మిగిలిన 22 అందచేయాలని ఆదేశించారు. జూలై 20 న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నాటికి జూలై 21 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి రానున్న రెండు రోజులు పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చెయ్యాలని కోరారు. క్షేత్ర స్థాయి సమస్యలను అధిగమించే ప్రయత్నం లో ముగింపు దశలో ఉన్న అన్ని భవనాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే జూలై 21 నాటి లక్ష్యాలను ఖచ్చితంగా పూర్తి చేసి భవనాలు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని క్షేత్ర స్థాయి సమస్యలు, ఇతర ఇబ్బందులు తెలియచేస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రాధాన్యత భవనాలకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయని,ఈ క్రమంలో ముందస్తుగా బిల్లులు అప్లోడ్ చేసిన వాటికి అదే క్రమంలో చెల్లింపులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ దృష్ట్యా ఇంజనీరింగ్ అధికారులు భవనాలు పనులు పూర్తి చేసేందుకు, బిల్లులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుందని మాధవీలత తెలిపారు.ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఏ బి వి ప్రసాద్, డ్వామా పీడీ జీ ఎస్ రామ్ గోపాల్, డివిజన్, మండల స్థాయి పంచాయతీ రాజ్ శాఖ డి ఈ లు, ఏ ఈ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News