రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని మానసిక చికిత్స విభాగాన్ని, మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను, ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి విషయాలను అడిగి తెలుసు కున్నారు. మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించి వసతులను పరిశీలించిన తరువాత ఖైదీలతో మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వారికి తెలియజేశారు. ఈ సేవలలో భాగంగా వారి తరపున వాదించేందుకు, బెయిల్ పీటీషన్లు కొరకు మరియు ఇతర కోర్టు ప్రొసీడింగ్స్ లో సహకరించేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమించడం జరుగుతుందని, ఈ సేవలను వినియోగించు కోవాలని తెలిపారు. న్యాయబద్ధ మైన జీవన సైలిని అలవర్చు కోవాలని చెప్పారు.
Prajavartha Online Telugu News