-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 27 వ డివిజన్ పరిధిలో దుర్గాపురంలోని బొప్పన రాఘవేంద్రరావు రోడ్డు, ఫౌండరీ వీధిలో సుమారు రూ.5.5 లక్షల అంచనాలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పనులను మరియు పారిశుధ్య నిర్వహణ తీరును క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శనివారం ఉదయం కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయా పరిసర ప్రాంతాలలోని సైడ్ డ్రెయిన్ ద్వారా మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, పాడైన డ్రెయిన్లకు తగిన మరమ్మత్తులు నిర్వహించాలని సంబందిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతంలో డివిజన్ పర్యటనలో గుర్తించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజి వ్యవస్థకు సంబందించి రోడ్ కంటే పల్లంగా ఉన్నదా మ్యాన్ హోల్స్ లను ఎత్తు పెంచుట మరియు పాడైన మూతల మార్పిడి వంటి పలు పనులను మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి సమస్యలను పరిష్కరించుట జరుగుతుందని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నగరంలోని అన్ని డివిజన్లలో అనేక అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎదురౌతున్న సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ సిద్దంగా ఉందని తెలియజేసారు.ఈ పర్యటనలో ఎస్.ఇ. రామ మోహన్ రావు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News