-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తరుచుగా అంబెడ్కర్ స్మృతి వనము స్థలాన్ని పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. ముఖం, ఇతర భాగాలను పరిశీలించారు. కమిషనర్ ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు పై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టు పనులను విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాత్రి వేళల్లో సైతం అధికారులతో కలిసి పనులను పరిశీలించి అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన డిజైన్లలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కార్మికుల భద్రతకు సంబంధించి అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.
ఈ ప్రాంగంణంలో అందమైన రకరకాల పూలు మొక్కలు, ఆకర్షణీయమైన మొక్కలతో గ్రీనరీ ఏర్పాట్ల పనులు పరిశీలించారు.
Prajavartha Online Telugu News