Breaking News

మాతృ , శిశు మరణాలు పై సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ లింగఎంపిక నిషేధ చట్టం- 1994 జిల్లా అప్రొప్రియాట్ అథారిటీ కమిటీ మీటింగ్ (DLMMAA), మాతృ , శిశు మరణాలు పై స్థానిక జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు సమావేశం ఏర్పాటు చేయడమైనది.జిల్లా కలెక్టర్ కె మాధవి లత అధ్యక్షతన పై సమావేశాలు నిర్వహించి అంశాల వారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరావు జిల్లాలో జరిగిన స్కాన్ సెంటర్లో తనిఖీలు మరియు డేకాయ్ ఆపరేషన్ నిర్వహించడం గురించి వివరాలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా న్యూక్లియర్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీదేవి ఈరోజు జిల్లా కమిటీ సమావేశము లో తీర్మానము నందు నాలుగు కొత్త స్కానింగ్ లు నాలుగు రెన్యూ వల్స్, 3 స్కాన్ సెంటర్ మార్పులు చేయడం నిమిత్తం కమిటీ ముందు తీర్మానంలో పెట్టడం జరిగిందన్నారు .ఈ సమావేశమునకు సమన్వయ జిల్లా అధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతు స్కానింగ్ సెంటర్స్ లో ఎక్కువ గర్భ స్రావాలు జరుగుతున్న హాస్పిటల్ నందు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు . జిల్లాలో విస్తృత స్థాయిలో ఎక్కువ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు. , ఈ ఆపరేషన్ నందు లింగ నిర్ధారణ చేసే స్కాన్ సెంటర్ లను గుర్తించి , వాటిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పుట్టిన బిడ్డల కు సంబంధించి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న మండలాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు . బహిరంగ సభల్లో ప్రజలకు ఈ విషయాలపై చర్చించడం ద్వారా అవగాహన కల్పించాలని కోరారు.జిల్లాలో ఒక మాతృ మరణం, మూడు శిశువుల మరణం జరగడం దురదృష్టకరం అన్నారు. ఇకపై జిల్లాలో ఒక్క మాతృ, శిశు మరణాలు సంభవించకుండ వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎమ్ ఎమ్ ఆర్, ఐ ఎమ్ ఆర్ మరణాల గురించి సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యుల నుంచి కలెక్టర్ సమగ్ర దర్యాప్తు చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది.ఈకార్యక్రమంలో DIO,Dr ఎన్.రాజ కుమారి ,Dy.DMHO Dr పి .వరలక్ష్మి, HE సత్యవతి, అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సభ్యులు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *