-ఈరోజు 179 కేసులు పరిష్కారం రూ.8 29 కోట్ల లకు అవార్డ్ జారీ
– ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
మోటారు వాహన ప్రమాదాల కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి గంధం సునీత అన్నారు.శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి గంధం సునీత మాట్లాడుతూ, రాజీ మార్గం ద్వారా కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గౌరవ సుప్రీం కోర్టు వారి ఉత్తర్వులు, గౌరవ హై కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందని అన్నారు. మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానం లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించి కక్షి దారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తద్వారా ఇటువంటి లోక్ అదాలత్ లు ఇరు పక్షాలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఈరోజు మోటార్ ప్రమాదాల కు చెంది 526 కేసులకు 178 కేసులకు రూ.8,83,18,449 లకు, అదే విధంగా భూ సేకరణ కు చెందిన ఒక కేసు కు రూ.8,90,777 ల పరిహారం చెల్లించాలని అవార్డ్ ఇవ్వడం జరిగిందన్నారుప్రతి ఏడాది 4 సార్లు జాతీయ లోక్ అదాలత్, 3 సార్లు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా కేసుల పరిష్కారం ద్వారా కక్షి దారులకు సత్వర న్యాయం జరిగేలా న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయని జిల్లా జడ్జి గంధం సునీత అన్నారు. ప్రజల్లో, కక్షి దారుల్లో లోక్ అదాలత్ లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం లో సామాజిక బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ కు వొచ్చిన కేసులకు పరిష్కారం చూపి తీర్పు వెల్లడించడం జరిగిందన్నారు.పరిష్కారం చూపిన కొన్ని తీర్పులు,:మోటారు వాహన ప్రమాద కేసులకు చెంది వెంకన్న పేట, రంగం పేట మండలం కు చెందిన పి. సత్యనారాయణ కు రూ. 12 లక్షలు, మంగళవారపు పేట, రాజమండ్రి కి చెందిన ఎరుపల్లి సింహాచలం రూ .12 లక్షలు, ఒరిస్సా కి చెందిన పి. గిరి భార్య కు రూ. 13 లక్షలు 50 వేలు ఈ కేసు లోనే కుమార్తె మైనర్ కు రితిక గిరి కు రూ.2 లక్షలు 50 వేలు, అనపర్తి కి చెందిన ఉప్పల పాటి పోతురాజు కు రూ.11 లక్షలు ప్రత్యేక లోక్ అదాలత్ లో కేసులకు అవార్డు జారీ చేయడం ద్వారా పారదర్శకం గా పరిష్కారం అయ్యాయి.ఈ ప్రత్యేక లోక్ అదాలత్ లో జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. ప్రత్యూష కుమారి, 10 అదనపు జిల్లా న్యాయ మూర్తి యం. నాగేశ్వరరావు, 8 వ అదనపు జిల్లా న్యాయ మూర్తి పి. ఆర్. రాజీవ్, ఎ. సి. బి. కోర్ట్ న్యాయ మూర్తి, యు. యు. ప్రసాద్, 5 వ అదనపు జిల్లా న్యాయ మూర్తి, డి. విజయ్ గౌతమ్, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు, జి. యు. వి. రాజు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News