-ఎటువంటి భేదాభిప్రాయాలు తావు లేకుండా చూడాలి
-రూరల్ నియోజక వర్గంలో ఒకే డోర్ నంబర్ లో 10 మించి ఉన్న ఓటర్ల జాబితా క్షేత్ర స్థాయిలో పరిశీలన
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఓటరు జాబితా సవరణ డోర్ టూ డోర్ సర్వే అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనం తో కూడి బూత్ స్థాయి అధికారులు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు.శనివారం సాయంత్రం రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎస్ ఎస్ ఆర్ 2024 మేరకు ఓటరు జాబితా సవరణ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు అత్యంత నిబద్దత తో ఇంటింటి సర్వే నిర్వహించి, నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు నిర్ణీత సమయం లో డోర్ టూ డోర్ సర్వే చేపట్టి అందుకుఅనుగుణంగా ఓటరు జాబితా సవరణ ప్రతిపాదనలు చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి భేదాభిప్రాయాలకు
తావులేకుండా బి ఎల్ వో విధులను నిర్వర్తించడం ముఖ్యం అన్నారు.క్షేత్ర స్థాయి లో ఒకే డోర్ నంబర్ లో 10 ప్లస్ ఓటర్ల సంఖ్య ఉన్న రెండు ఇండ్లను తనిఖీ చేయడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజక వర్గం పిడింగొయ్యి గ్రామం లోని గణేష్ నగర్ లో డోర్ నంబర్ 6-86/1 లో 60 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీరిలో 24 మంది నుంచి ఫారం 8, 28 మంది నుంచి ఫారం 7 తీసుకుని మార్పులు చెయ్యడం జరిగిందన్నారు. మిగిలిన 8 మంది ఓటర్ల కు డోర్ నంబర్ లని నిర్ధారణ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జయలక్ష్మి నగర్ లో డోర్ నంబర్ 14-59 లో 15 ఓటర్లు ఉన్నట్లు గుర్తించి నట్లు తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసి ఉన్నారా తదితర వివరాలను స్థానికుల నుంచి కలెక్టర్ తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారు అందుబాటులో లేనందున, వారి వివరాలు సేకరించి తగిన ప్రతిపాదనలు పంపాలని ఆర్డీవో ను ఆదేశించారు. ఓటరు జాబితా సవరణలో హేతుబద్ధత కలిగి ఉండాలని మాధవీలత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.కలెక్టర్ వెంట ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, తహశీల్దార్ ఎ. చిన్నా రావు, డి టి సాగర్, పిడింగోయ్యి పంచాయతీ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి రూప్ చంద్, బి ఎల్ వో లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News