Breaking News

ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి, అకడమిక్ విద్యను అభ్యసించే

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి, అకడమిక్ విద్యను అభ్యసించే ఆశక్తి ఉన్న వారిని రైతు శాస్త్రవేత్తలుగా తీర్చి దిద్దేందుకు రైతు సాధికారత సంస్థ తగిన శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు పేర్కొన్నారు. మార్గదర్శకులు ద్వారా రైతు శాస్త్రవేత్తలకు నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యిన తర్వత ప్రకృతి వ్యవసాయంలో డిగ్రీ పట్టాను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.బుధవారం స్థానిక సంహిత ఆడిటోరియంలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాధవరావు వివరాలు తెలియ చేస్తూ విద్యార్థులకు 4 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జూలై 25 నుంచి 28 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండవ రోజు శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాధవ రావు మాట్లాడుతూ రైతు సాధికార సంస్థ ద్వారా రైతు శాస్త్రవేత్తల కోర్స్ ను ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పులివెందులలో ప్రారంభించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయంలో అనుభవజ్ఞులైన వారిని దిశా నిర్దేశకులుగా, మర్గర్దర్శకులుగా తీసుకోవడం జరిగిందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారిని తగిన ప్రోత్సాహం ఇస్తూ రైతు శాస్త్రవేత్తలుగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ మెంటార్సకు రైతు శాస్త్రవేత్తలకు నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలో డిగ్రీ పట్టాను అందించడం జరుగుతుందన్నారు.ఈ నాలుగు సంవత్సరాల కోర్సులో 8 సెమిస్టర్స్ గా విభజించి వారికి బోధన చెయ్యడం జరుగు తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలను 7 జోన్ లుగా విభజించి ఏడు ప్రాంతీయ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని (ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ) మెంటర్స్ మరియు రైతు శాస్త్రవేత్తలకు 25 వ తేది నుండి 28వ తేదీ వరకు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా చేపట్టే మెలకువలు వాటి యొక్క ప్రాముఖ్యతను మరియు రానున్న రోజుల్లో వ్యవసాయం లాభసాటి గా ఉండేందుకు గాను నేటి యువత పాత్ర ప్రధానమని తెలిపారు. అదే విధంగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న శాస్త్రీయతను శద్ధగా నేర్చుకుంటు వారి పొల్లాలో అవలంభిస్తూ వారి గ్రామాన్ని వాతవరణ పరిస్థితి, ఆమేరకు వ్యవసాయం చేపట్టి విపత్తులకు తట్టుకునే గ్రామముగా మార్చుమని సూచించారు. ఈ కోర్సులో మహిళలు, యువత అభినందనీయమన్నారు.శిక్షణ కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ జకీర్ హుస్సేన్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. తాతారావు, శిక్షణ పొందుతున్న యువతీ, యువకులు, టైపిపిలు, డిపిపిలు సైంటిస్టులు, పలు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *