– ఇకపై ప్రతి నెల మూడో శుక్రవారం ఎంప్లాయీస్ గ్రివియాన్స్ డే
-జిల్లా కలెక్టరేట్ స్పందన హల్ లో జూలై 28న సా.4 నుంచి అర్జీల స్వీకరణ
– జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు.ఆనేపథ్యంలో జూలై నెలకు సంబంధించి ఈనెల 28 శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు వారికి చెందిన అర్జీలను స్వీకరించేందుకు కలెక్టరేట్ లోని స్పందన హల్ నందు సా 4 గంటల నుంచి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉండడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగులు వారికి చెందిన వ్యక్తిగత, తదితర అర్జీలను వ్రాత పూర్వకంగా అందచేయాలని కలెక్టర్ తెలియ చేశారు. ఆగస్ట్ మాసం నుంచి ఇకపై ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగస్తుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఉద్యోగుల తొలి గ్రీవెఎన్స్ డే ను జూలై 28 శుక్రవారం నిర్వహిస్తున్న దృష్ట్యా ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. సంబంధిత జిల్లా అధికారులు ఈ విషయం పై ఉద్యోగులకు అవగాహన కలుగ చేయాల్సిందిగా కలెక్టర్ మాధవీలత ఆదేశించారు.
Prajavartha Online Telugu News