రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి బుధవారం బంగారు కొండ కార్యక్రమంలో భాగంగా నాగభూషణం ఇంటికి వెళ్ళడం జరిగిందని, నెలరోజుల్లో 600 గ్రాముల బరువు పెరగడం జరిగిందని బాలమిత్ర, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.బుధవారం ఉదయం స్థానిక ఇన్నిస్ పేట – వాక అప్పలస్వామి వీధిలో నివాసం ఉంటున్న జీ. నాగభూషణం ఇంటిని సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, కలెక్టర్ మాధవీలత ఆలోచన, జిల్లా యంత్రాంగం సహకారంతోపౌష్టికాహార లోపం గల పిల్లలను దత్తత తీసుకుని ప్రతినెలా 500 రూపాయలు వెచ్చించి ఆరు నెలలు పాటు బంగారు కొండ కిట్ అందచేస్తున్నా మన్నారు. తద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకుని రావడానికి ఇది ఒక చక్కటి అవకాశం అని పేర్కొన్నారుపిల్లవాని ఇంటికి వెళ్లి తల్లి పద్మకు బంగారుకొండ కిట్ ద్వారా జరిగిన ప్రయోజనం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 9.8 కేజీల బరువు ఉన్న నాగభూషణం 600 గ్రాములు పెరిగి 10.400 కేజీలకు బరువు చేరడం జరిగిందని జేసీ అన్నారు.బాలమిత్రాలు ఖచ్చితంగా ప్రతి బుధవారం వొచ్చి పిల్ల వానిలో జరుగుతున్న మార్పులు, పెరుగుదల గమనించడం జరుగుతుందని జేసీ తెలియచేశారు. బంగారు కొండ కిట్ ద్వారా అందించే ఆహారం తోపాటు ప్రభుత్వం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పదార్థాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతవారం దత్తత తీసుకున్న బాలురకు వైద్య పరీక్షలు నిర్వహించి నట్లు పేర్కొన్నారు.జాయింట్ కలెక్టర్ వెంట ఐ సి డి ఎస్ అధికారి సిహెచ్ వి. నరసమ్మ, సూపర్వైజర్ బి. వరలక్ష్మి, బాబు తల్లితండ్రులు ఉన్నారు.
Prajavartha Online Telugu News