రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ను జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు బుధవారం ఉదయం స్థానిక ప్రవేటు వసతి గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.జిల్లాలో ప్రాధాన్యత భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో సమీక్ష చెయ్యడానికి జిల్లాకు ఆయన రావడం జరిగింది .ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ప్రాధాన్యత భవనాల నిర్మాణం, అదనపు నిధుల కేటాయింపు తదితర అంశాలపై కలెక్టర్ మాధవీలత వివరించడం జరిగింది.
Prajavartha Online Telugu News