Breaking News

విభూతి బాబూరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి తానేటి వనితపాల్గొన్న ఎంపీ మార్గాని భరత్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావాన్ని సైతం తట్టుకుని ప్రజలకు అందించాల్సిన సందేశాన్ని తమ కళల ద్వారా చేరవేస్తున్న కళాకారుల సేవలు అభినందనీయమని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో నిర్వహించిన ప్రముఖ కళాకారుడు విభూతి బాబూరావు విగ్రహావిష్కరణలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, రుడా ఛైర్ పర్సన్ మేడపాటి షర్మిలతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. విభూతి బాబురావు విగ్రహం ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బాబురావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా, భక్తి పరంగా అనేక ప్రదర్శనలను వారి కుటుంబం ఇచ్చిందన్నారు. విభూతి వారి ఆడపడుచైన సుబ్బలక్ష్మి కూడా పురుషులతో సమానంగా, చాలా యాక్టివ్గా ప్రదర్శనలు ఇచ్చేవారని, హాస్యం పండించడంలో పేరు సంపాదించారని తెలిపారు. ఒక మహిళగా కళా రంగంలో రాణించడంపై ఆమెను అభినందించారు. బుర్రకథ చెప్పేటప్పుడు చాలా హుందాగా, సన్నివేశానికి తగినవిధంగా హాస్యం, పౌరుషం, క్రోధం.. ఇలా నవరసాలను పలికించే వ్యక్తి బాబూరావు మన మధ్య లేకపోవడం బాధాకరమైనప్పటికీ ఆయన కళాకారుడిగా ఎప్పటికీ చిరస్మరణీయులుగా ఉంటారని తెలిపారు. నేడు మారుతున్న టెక్నాలజీ యుగంలో కూడా బుర్రకథల ద్వారా ప్రజలకు అందించాల్సిన సందేశాన్ని ఎంతో ప్రావీణ్యంతో వారికి చేరేట్లుగా చేస్తున్న కళాకారుల సేవలు అభినందనీయమన్నారు. కళాకారుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎంపీ భరత్ కు సూచించారు. నిర్మాణానికి సంబంధించిన స్థలం, ప్రణాళికతో కళాకారులు ముందుకు వస్తే తమ వంతు సహాయ, సాకారాలు అందజేస్తామని హోంమంత్రి తానేటి వనిత ప్రకటించారు.ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో ఆనం కళాకేంద్రంలో కళాకారుల ప్రదర్శనలకు, కార్యక్రమాలకు 50 శాతం రాయితీతో అద్దెకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కళాకారులకు సాయం అందించడానికి తానెప్పుడు సిద్దంగా ఉంటానని ప్రకటించారు. ఈ ప్రాంతంలో కొంతమందికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్లు నిలిచిపోతే అవి పునరిద్దరించేలా చర్యలు తీసుకున్నానని గుర్తు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *