-గోడౌన్ వద్ద సిసి కెమెరాల పర్యవేక్షణ, 24 గంటల భద్రతా పర్యవేక్షణ
-జిల్లా కలెక్టరు మాధవీలత, జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రానికి ఓటింగ్ వెరిఫికేషన్ ప్యాడ్స్ 4930 చేరుకున్నాయని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు.గురువారం స్థానిక లాలాచెరువు సమీపంలో ఎఫ్ సిఐ గోడౌన్స్ లో భద్ర పరచిని యూనిట్స్ కలెక్టర్, జేసీ ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అనుబంధ యూనిట్స్ అత్యంత కట్టదిట్టమైన భద్రత నడుమ ఈ గో డౌన్ లో భద్రపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరగటం తో పాటు నిరంతర ప్రక్రియ సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా నీడలో నిరాహార పర్యవేక్షణ చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టరు తేజ్ భరత్, డీఆర్వో నరశింహులు ఆర్డీవో ఎ . చైత్ర వర్షిణి, సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించి భద్రత ఇతర అంశాలపై తగిన సూచనలు చెయ్యడం జరిగిందన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఇబ్బందులు లేకుండా గోడౌన్ లోపల విద్యుత్ వైర్ల, సరఫరా లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతరం సిసి కెమెరాల పర్యవేక్షణ, భద్రతా సిబ్బంది కాపలా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.అంతకు ముందు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News