-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత,
-ఎంపీ మార్గాని భారత్ రామ్
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన క్రింద జిల్లాలో 12 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రెండవ విడతగా రు. 1,37,09,253 రూపాయలు జమచేసిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు.గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి వెలగపూడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం లో జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రెండవ విడత సొమ్ము బటన్ నొక్కి జమ చేశారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయిజగనన్న విదేశీ విద్య కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ షర్మిళారెడ్డి, జేసి తేజభరత్ లు పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన క్రింద ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, బీసీ, ఓసి విద్యార్థులు 12 మందికి రెండవ విడతగా రు. 1,37,09,253 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు జమచేసిందన్నారు. ఇందులో ఎస్సీ-2, మైనారిటీ -1, బీసీ-2, ఈబీసీ-3, ఓసి-4 మొత్తం 12 మందికి ఫీజు రియంబర్స్ ను అందించడం జరిగిందన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారి చదువులు ఒక్కో మెట్టూ ఎక్కే కొద్ది 4 వాయిదాల్లో ప్రభుత్వం స్కాలర్ షిప్స్ మంజూరు చేస్తుందన్నారు. ఇమ్మిగ్రేషన్ – కార్డు (ఐ-94) పొందాక తొలి వాయిదా, మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత, 2వ వాయిదా.. 2వ సెమిస్టర్ ఫలితాల తర్వాత, 3వ వాయిదా.. విజయవంతంగా 4వ సెమిస్టర్ పూర్తి చేసి మార్క్ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేశాక చివరి వాయిదా చెల్లింపు ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులు యుఎస్ఏలో-3, యుకే లో-7, కెనడాలో-ఒక్కరు, కజికిస్తాన్ లో -ఒక్కరు చొప్పున విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యశిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పధకం క్రింద 8 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలు అర్హులని తెలిపారు. ఎస్.సి,ఎస్.టి, .బి.సి, మైనారిటీ లకు 1.25 కోట్ల వరకు, ఇతరులకు కోటి రూపాయల వరకు ప్రభుత్వం విదేశీ విద్యకు అందిస్తున్నట్లు తెలిపారు.ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 357 మంది విద్యార్థులకు రూ. 45.53 కోట్లు నేడు ముఖ్యంత్రి బటన్ నొక్కి వారి ఖాతాలకు జమ చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు పూర్తి ఆర్థిక సాయంగా రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు నూరు శాతం ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ జగనన్న విదేశీ విద్యా దీవెనగా అందిస్తుందన్నారు. ప్రపచంలో టాప్ యూనివర్సిటీల్లో చదవగలిగే ప్రతిభ ఉండి కూడా పేదరికం కారణంగా చదువుకోలేని విద్యార్థులకు వీదేశీ విద్యాదీవెన ఎంతో బాసటగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన ఆరు మాసాల్లో జగన్న విద్యాదీవెన క్రింద రూ. 65.48కోట్లు ఆర్థిక సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు.రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతిభ గల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అందిపుచ్చుకొనేందుకు జగనన్న విద్యాదీవెన ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఉతన్నవిద్యను 50 దేశాల్లో 21కోర్సుల్లో చదువుకునే అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం కల్పించిందన్నారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డీఎస్ డబ్య్లూఓ సందీప్, డీబీసీడబ్ల్యూఓ పి.ఎస్. రమేష్, ఏబీసీడబ్ల్యూఓ పి.రామకృష్ణ, యం.సుబ్బారావు, విద్యార్థుల తల్లితండ్రులు నంబూరి సత్యనారాయణరాజు,వాణీ ఈశ్వరీ,పోలిన వెంకటసత్యనారాయణ, స్వరూప, కొండేటి ఫణిరాజు, గంగారత్నం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News