రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రయోగత్మకంగా అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన బంగారుకొండ కార్యక్రమం ద్వారా సత్ ఫలితాలు కలుగుతున్నయని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.గురువారం ఉదయం స్థానిక ఐదు బండ్ల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న రేలంగి ఇవాంశిక నివాసానికి కలెక్టరు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భగా కలెక్టరు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని, బాలామృతం, కోడుగ్రుడ్లు, తో పాటు బంగారుకొండ కిట్ ద్వారా ఇచ్చిన ఆహార పదార్థాలు పాపకు అందించిన తీరు పట్ల కలెక్టరు డా.కే. మాధవీలత సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. పౌష్టికాహార లోపం ఉన్న రేలంగి ఇవాంశిక వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు, రక్త హీనత కలిగి ఉన్నట్లు గుర్తించామన్నుర. ఆ క్రమంలో పాపకు పౌష్టికాహారానికి అదనంగా అందించడం తో డాక్టర్ల సలహా మేరకు తగిన విధంగా పర్యవేక్షణ చెయ్యడం వల్ల బరువు పెరగడం తో పాటు రెండు ఎత్తు పెరగడం గమనించామన్నారు. బంగారు కొండ కార్యక్రమం ప్రక్రియలో భాగంగా చిన్నారికి పౌష్టికాహారం అందించడం వలన రక్తంలో హేమోగ్లోబిన్ శాతం కూడా పెరిగిందని వైద్యలు నిర్థారించాన్నారు.జిల్లాలో 6 నెలలు నిండి 6 సంవత్సారాలు లోపు పిల్లలను 1293 మందిని గుర్తించామని కలెక్టరు తెలిపారు. ప్రతి బుధవారం బాలమిత్రాలు బంగారుకొండ చిన్నారుల ఇంటికి వెళ్లి ఆ పిల్లల అందించిన ఆహార పదార్థాల వివరాలు, ఆరోగ్య వివరాలు పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. బంగారుకొండ కిట్ ద్వారా అందించిన పౌష్టికాహారాన్ని పిల్లలకు మాత్రమే అందించాలని, ప్రతి నెలా ఒక కిట్ ఇవ్వడం ద్వారా ఆరు నెలలు పాటు పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇవాంశిక లో చక్కటి పురోగతి సాధించడం పట్ల ఎంతో ఆనందం కలిగిందని అన్నారు.కలెక్టర్ వెంట ఐ సి డి ఎస్ అధికారులు, ఇతర సిబ్బంది వున్నారు.
Prajavartha Online Telugu News