Breaking News

స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలి

-జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
-జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత జిల్లా అధికారులను ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్..ఎస్పీ, జేసీ,మున్సిపల్ కమీషనర్ లతో కలసి ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ఆగష్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 9 గం.లకు ప్రారంభమవుతాయని అన్నారు.77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బoగా “మేరా మిట్టి మేరా దేశ్ ” ప్రతి గ్రామ పంచాయతీలో 75 మొక్కలు నాటాలనిఅన్నారు. అలాగే ఒక పైలాన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆరోజు ప్రతి ఒక్కరు గ్రామంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించు కోవాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు సన్మానించుకో వాలని అలాగే పంచ ప్రాణ ప్రతిజ్ఞ, జెండా వందనం చేయాలన్నారు. అందుకు సంబంధిత శాఖల అధికారులు కావలసిన చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యులు  చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం ప్రసంగం, స్వాతంత్ర్య సమరయోధులతో పరిచయ కార్యక్రమం, మాక్ డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసా పత్రాలు , మెమెంటో ల పంపిణీ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. పేరేడ్ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ , వేదిక ఏర్పాట్లను ఇంజనీరింగ్ శాఖ, రెవిన్యూ డివిజనల్ అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు. మున్సిపల్ కమీషనర్ కె . దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు వేడుకల పర్యవేక్షణ ఏర్పాటు భాద్యతలు చెప్పడతారని పేర్కొన్నారు. సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.గృహ నిర్మాణ శాఖ, జిల్లా పౌర సరఫరాల అధికారి, గిరిజన సంక్షేమం, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ,అటవీ శాఖ, కుటుంబ సంక్షేమం, డా.వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం, రహదారుల భద్రత, అగ్నిమాపక శాఖ మరియు, డ్వామా తదితర శాఖలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇనుమడింప జేసేలా శకటాలను, ఎగ్జిబిషన్ స్టాళ్ల్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల వివరాలు అందజేయాలన్నారు. ప్రతీ శాఖ నుండి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకు మాత్రమే అవకాశం కల్పించాలని , ఆగస్ట్ 8 వ తేదీలోగా పేర్లు ఇవ్వాలని సూచించారు. అలాగే పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులచే , వివిధ బృందాలకు చెంది సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఏ.పి.ఇ.పి. డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజినీరును ఆదేశించారు. అధికారులందరూ వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.జిల్లా ఎస్పీ సిహెచ్. సుదీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫెరెడ్ ఏర్పాట్లు, ట్రాఫిక్, బందోబస్తూ వంటి అంశాలపై పోలీస్ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్. సుదీరకుమార్ రెడ్డి,జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కే. దినేష్ కుమార్ రెడ్డి, సహాయ కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో జి. నరశింహులు, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి. స్వామినాయుడు, ఆర్డీవో ఎస్.మల్లిబాబు, ఏ . చైత్ర వర్షిణి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *