Breaking News

జిల్లాలో బంగారుకొండ కార్యక్రమం సత్ ఫలితాలనిస్తోంది.. కలెక్టరు డా. కె.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బంగారు కొండ కార్యక్రమం ద్వారా నెల రోజుల వ్యవధిలో 144 మంది బరువు తక్కువ, రక్త హీనత, వయస్సుకు తగ్గ ఎత్తు పిల్లలను సాధారణ స్థితికి తీసుకుని రావడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత కే.మాధవీలత పేర్కొన్నారు.సోమవారం ఉదయం బంగారుకొండ కార్యక్రమం పై నియోజక వర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులతో కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ లు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో సాం మాం (SAM MAM) పిల్లల ఎదుగుదల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకానికి అదనంగా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. వయస్సుకు తగ్గ వృద్ధి ప్రమాణాల ప్రకారం మధ్య బరువుతో కూడిన మితమైన పోషకాహార లోపం, ఎత్తుకు తగ్గ బరువు లేని వారీగా ఉన్నట్లు గుర్తించి వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలుపై అవగాహన కలుగ చేస్తున్నామన్నారు. జిల్లాలో జూన్ 21 నాడు ప్రారంభించి తొలివిడత లో గుర్తించిన 1283 మంది సున్న నుంచి ఆరు ఏళ్ల వయసు కలిగిన వారిలో గత నెలరోజులుగా చేపట్టిన చర్యల వల్ల 144 మంది పిల్లలు సాం మాం నుంచి బయటకు వచ్చిన సందర్భంగా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఆక్రమంలో బంగారు కొండ పిల్లలను దత్తత తీసుకుని ముందుకు వచ్చిన బాల మిత్రాలని అభినందించడం కోసం మండల స్థాయి లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అధిక పౌష్టికాహర లోపం, తదితర కారణాలను పరిశీలించి వాటిని అధిగమించే ప్రయత్నం చెయ్యడం ద్వారా మెరుగైన ఫలితాలు కలుగు తాయన్నారు. బంగారు కొండ కిట్స్ కింద అందచేస్తున్న పోషక విలువలు కలిగిన పదార్థాల స్థానంలో వైద్యులు సూచించిన విధంగా వయస్సు కు తగ్గ న్యూట్రీషన్ అనుబంధ ఆహారం అందించడం అవసరం అన్నారు.బంగారు కొండ కింద దత్తత తీసుకున్న వారి ఇంటికి బాలమిత్ర కింద కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారులు వాళ్ళ ఇళ్లకు వెళ్ళడం వల్ల వారిలో ప్రత్యేక శ్రద్ద కలుగడం శుభ సూచకం అని మాధవీలత తెలిపారు. నెలలో ప్రతి బుధవారం బాలమిత్ర లు తప్పని సరిగా బంగారుకొండ పిల్లల ఇంటికి వెళ్ళడం ఒక సామాజిక సేవ కింద భావించాలని కోరారు. బంగారు కొండ కింద పిల్లలను గుర్తించే ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ కోరారుజాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన బంగారుకొండ కార్యక్రమం సత్ఫలితాలు సాధించే దిశలో అడుగులు వేయడం జరగటం పట్ల అధికారుల, సిబ్బంది నిబద్దత ప్రశంసనీయం అన్నారు. ఇకపై ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో భాగంగా డాక్టర్లు క్షేత్ర స్థాయిలో వెళ్ళే సందర్భంలో ఖచ్చితంగా బంగారుకొండ ఉన్న పిల్లల ఇంటికి వెళ్ళి ఆరోగ్య స్థితి, ఎదుగుదల పై పరిశీలన చేయాలని అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ – వైద్య శాఖ పూర్తి సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. ఎదుగుదల సరిగా లేని వారి విషయంలో తగిన వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు కారణాలు తెలుసుకుంటే తప్పకుండా పిల్లల ఎదుగుదల లోపాల్ని అధిగమించడం సాధ్యం అవుతుందన్నారు.ఈ సమావేశంలో ఐ సి డి ఎస్. కే. విజయ కుమారి, ఆర్డీవో లు ఎస్. మల్లి బాబు, ఏ. చైత్ర వర్షిణి, డిఆర్డిఎ పిడి ఎస్. సుభాషిణి, డి ఎ హెచ్ ఓ ఎస్ జి టి సత్య గోవింద్, డి ఎం హెచ్ ఓ డా కె. వేంకటేశ్వర రావు, డి టి డబ్ల్యు ఓ కే ఎస్ జ్యోతీ, డిపివో జేవి సత్యనారాయణ, ఎపిడి జీ. శ్రీనివాస్, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి కె . స్వాతి, డి ఎల్ డి ఓ పి. వీణా దేవి, వి. శాంత మణి, టిడ్కో డి ఈ జి. నాగేశ్వరి, కే ఎస్ ఆర్మ్ స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *