Breaking News

జూన్ నెలకు ఉత్తమ ఆరోగ్య సేవా మిత్రా గా కె. స్వాతి

-సేవా పత్రం, 5 వేల నగదు పురస్కారం
– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఒక ఆరోగ్య మిత్రాలని గుర్తించి ఆమేరకు ప్రతి నెలా అవార్డ్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె మాధవీలత మాట్లాడుతూ డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ మరియు ఆరోగ్య ఆసరా పథకాలు అమలులో భాగంగా వైద్యం కోసం వచ్చే ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు ఆరోగ్యమిత్రగా అందించిన సేవలకు గాను రాష్త్ర ప్రభుత్వం సేవా ఆరోగ్యమిత్ర పురస్కారం ఇచ్చి సత్కరించడం జరుగుతోందని అన్నారు. ఆమేరకు జిల్లాకు చెందిన టి. స్వాతి ని ఎంపిక చేయడం జరిగిందన్నారు.జూన్ నెలకు గాను జిల్లాకు చెందిన టి . స్వాతి (అన్నపూర్ణ హాస్పిటల్) ని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత చేతులమీదుగా ప్రశంసా పత్రం మరియు 5 వేల రూపాయల నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. పి . ప్రియాంక, టీం లీడర్ లు రహీమ్, నరేష్ , పలువురు ఆరోగ్య శ్రీ మిత్రాలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *