-చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసే నిత్యవసర సరుకుల తూకం పరిశీలన
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఎం ఎస్ ఎల్ పాయింట్ ద్వారా ప్రతినెలా 3 వేల టన్నుల షార్టెక్స్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు .బుధవారం ఉదయం బొమ్మురు లోని ఎం ఎస్ ఎల్ పాయింట్ వద్ద గోడౌన్ ను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రజలకు చౌక ధరల దుకాణం ద్వారా పంపిణీ చేసే నిత్యవసర సరుకులను సరైన తూకంలో ఎం ఎస్ ఎల్ పాయింట్ వద్ద నుంచి సరఫరా చెయ్యడం జరుగుతోందని అన్నారు. ఆమేరకు రూరల్ పరిధిలోని స్టాక్ పాయింట్ ను , అక్కడ సరుకు యొక్క తూకం తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ ఎం ఎస్ ఎల్ పాయింట్ ద్వారా రాజమండ్రి రూరల్, అర్బన్, కడియం, రాజానగరం పరిధిలోని 256 చౌక ధరల దుకాణాలకు పౌర సరఫరాల శాఖ ద్వారా అందచేసే బియ్యం, పంచదార, ఆయిల్ ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆక్రమంలో ఎమ్ ఎస్ ఎల్ పాయింట్ వద్ద ఉన్న సరుకును తనిఖీ చేశామన్నారు. ఈ స్టాక్ పాయింట్ ద్వారా 3 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తూకంలో ఎటువంటి తేడాలు లేకుండా చూడడం జరుగుతుందని,ఆ క్రమంలో ఉన్న స్టాక్ ను పరిశీలించాలన్నారు. రేషన్ షాపు ల ద్వారా ప్రతి నెలా 19 వ తేదీ నాటికి ఇండెంట్ వివరాలు సేకరించి ఆమేరకు సరఫరా చేయడం జరుగుతోందని తేజ్ భరత్ తెలిపారు. పౌష్టిక విలువల తో కూడిన షార్టెక్స్ బియ్యం ప్రజా పంపిణీ ద్వారా అందచేస్తున్నట్లు తేజ్ భరత్ తెలిపారు.అంతకు ముందు స్టాక్ వివరాలు, ఇన్వర్డ్, ఔట్వర్డ్ రికార్డులను పరిశీలించారు. హమాలీ లు ద్వారా సరుకు బరువు ను తనిఖీ చేశారు.జేసీ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి కె. విజయ భాస్కర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఏ. కుమార్, ఏం ఎస్ ఎల్ పాయింట్ ఇంఛార్జి ఎం కే. సుధీర్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News