రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 870 చౌక ధరల దుకాణాల కు చెందిన నిత్యవసర సరుకులను 364 మొబైల్ డెలివరీ యూనిట్స్ (వాహనాలు) చెయ్యడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.బుధవారం స్థానిక ఇన్నిస్ పేట వద్ద మొబైల్ డెలివరీ వాహనం ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ తీరును జాయింట్ కలెక్టర్ క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. కొవ్వూరు లో ప్రభుత్వ కార్యక్రమానికి వెళుతున్న జేసీ పౌర సరఫరాల సరుకులను పంపిణీ చేస్తున్న వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి తూకం, ఆన్లైన్ లో నమోదు, బయో మెట్రిక్, ఐరిష్ పనితీరు తదితర వివరాలు పై సమగ్రంగా పరిశీలన చేశారు.ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ ప్రజలతో ముఖాముఖి సంభాషించడం జరిగింది. జేసీ వివరాలు తెలియచేస్తూ, జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా 8 వేల 500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. ఆ క్రమంలో తూకంలో ఎటువంటి తేడాలు లేకుండా చూడడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్ ఎస్ ఎల్ పాయింట్ వద్ద కు చేరే సరుకు ఇన్వర్డ్, ఔట్వర్డ్ సందర్భంలో తూకం వెయ్యడం, రేషన్ షాపు వద్ద కూడా తూకం వేసి, ఎమ్ డి యూ ఆపరేటర్ కి సరుకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్డు దారులకు వారు నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లి ఖచ్చితమైన తూకం తో నిత్యావసర సరుకులు బియ్యం, పంచదార, ఆయిల్, పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి అందచేస్తున్నట్లు తెలియ చేసారు. ప్రతినెలా ఉచితంగా బియ్యం పంపిణీ కోసం జిల్లాలో రూ.32 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో పోషక విలువలు కలిగిన సార్ట్ఎక్స్ బియ్యం అందిస్తున్నామని , వీటిని కార్డు దారులు తప్పనిసరిగా వినియోగించు కావాలని కోరారు. తూకం కి సంబంధించి ప్రజల నుంచి జేసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఈ సందర్భంలో సంతృప్తి వ్యక్త పరచడం జరిగింది.
Prajavartha Online Telugu News