Breaking News

సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం..

-దాతల సహకారంతో సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నాం..
-స్వాతి బలరాం సహకారం స్పూర్తిదాయకం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సంక్షేమ వసతి గృహాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని దాతల సహకారంతో మరిన్ని మౌలిక వసతుల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్వాతి బలరాం అందించిన సహకారం స్పూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.భవాని పురంలోని సాంఫీుక సంక్షేమ బాలికల వసతి గృహం నందు వేమూరి (స్వాతి) బలరాం ఆర్థిక సహకారంతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పరిశీలించి దాతలను సత్కారించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 66 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఇందులో 38 సాంఫీుక సంక్షేమ వసతి గృహాలు ఒక గిరిజన సంక్షేమ వసతి గృహం 27 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి నాడు`నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపులేఖలను మార్చి ప్రైవేట్‌ పాఠశాలల ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్య నానాటికి గననీయంగా పెరుగుతున్నాయన్నారు. దీనితో పాటు సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన మరమత్తులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో నిర్మించిన పురాతన భవానిపురం సాంఫీుక సంక్షేమ వసతి గృహనికి మరమత్తులు చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురి కావాల్సి వచ్చిందన్నారు. వసతి గృహానికి అవసరమైన మరమత్తులు చేపట్టేందుకు అంచనాలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించామన్నారు. ఈ దశలో తాము స్వాతి సపరి వార పత్రిక ఎడిటర్‌ వేమూరి బలరాం ఒక కార్యక్రమంలో కలిసిన సందర్భంలో లక్ష రూపాయలు విరాళాన్ని కలెక్టర్‌ ప్రత్యేక నిధులకు బహుకరించారన్నారు. వేమూరి బలరాం అందించిన నిధులతో వసతి గృహ మరత్తు పనులను ప్రారంభించడం జరిగిందని ఇందుకు 2.50 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మరమత్తులు చేయకముందు 25 మంది విద్యార్థులు ఉండేవారని వసతి గృహాన్ని అభివృద్ధి చేయడంతో విద్యార్థుల సంఖ్య 75కి పెరిగిందన్నారు. దాతల సహకారంతో సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేమూరి బలరాంను స్పూర్తిగా తీసుకుని మరింత మంది దాతలు ముందుకు వచ్చి విద్యా రంగ అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.స్వాతి బలరాం మాట్లాడుతూ పున:విభజన అనంతరం ఏర్పడిన ఎన్‌టిఆర్‌ జిల్లాకు తొలి కలెక్టర్‌గా నియమిత్తులైన ఎస్‌.డిల్లీరావు అభివృద్ధి ఆహర్నిసలు పాటుపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా అభివృద్ధితో పాటు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నా ఆయనకు తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో లక్ష రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. తాను అందించిన ఆర్థిక సహయాన్ని నిరుపేద కుటుంబాలకు చెందిన పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడటం సంతోషదాయకమన్నారు. భవానిపురం సాంఫీుక సంక్షేమ వసతి గృహనికి మరో లక్ష రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విద్యా రంగం అభివృద్ధికి తన సహకారం ఎల్లపుడు అందిస్తానని విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి ఉత్తమ పౌరులుగా మంచి పేరు తీచ్చుకోవాలని ఆశీసులు అందిస్తున్నానన్నారు.కార్యక్రమంలో జిల్లా సాంఫీుక సంక్షేమ అధికారిణి బి. విజయభారతి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అనీల్‌కుమార్‌, డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎన్‌ రాయన్న, సహాయ సంక్షేమ అధికారి యు.వి. కోటేశ్వరరావు, వసతి గృహ సంక్షేమ అధఙకారిణి టి ఆదిలక్ష్మి, గుత్తేదార్‌ చండిక రవిశ్రీ బాబు, వేమూరి బలరాం కుటుంబ సభ్యులు రావులపల్లి రaాన్సీ, తుమ్మల వెంకటరత్నం, సిబ్బంది కందుల మాధవి, నిమ్మగడ్డ కామేశ్వరి మోర్ల జానకిరావు వసతి గృహా విద్యార్థినిలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *