Breaking News

స్పందనలో వొచ్చిన అర్జీలు 123

-పరిపాలనా పరమైనవి 100 అర్జీలు, పోలీస్ అర్జీలు 23
-ప్రతి మూడో సోమవారం అందరూ జిల్లా స్థాయి అధికారులు విధిగా జిల్లా స్థాయి లో హాజరు కావాలి
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన లో వొచ్చే ప్రతి ఒక్క అర్జిని ఆయా శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని సహేతుకమైన విధానంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు.సోమవారం ఉదయం కలెక్టరేట్ లో రెవెన్యూ5, పోలీస్, ఇతర శాఖల కు చెందిన స్పందన అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, అదనపు ఎస్పీ ఎం. రజనీ, డి ఆర్వో జి. నరసింహులు, టూరిజం ఈ డి ఎస్ డి సి వి. స్వామి నాయుడు లతో కలిసి స్పందన అర్జీలను స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, సోమవారం స్పందన లో మొత్తం 167 మంది ప్రజలు వివిధ సమస్యలుపై అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. వీటిలో ఆన్లైన్ లో 93, ఆఫ్ లైన్ లో 30 మంది నుంచి అర్జీలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలు 100 రాగా, పోలీసు లకు చెందినవి 23 వచ్చినట్లు తెలిపారు. జగనన్న సురక్ష కింద తొంబై తొమ్మిది శాతం పైగా అర్జీలను పరిష్కారం చేశామన్నారు. ప్రతి ఒక్క అర్జి పరిష్కారం చెయ్యడం తో పాటు ఆడిట్ చెయ్యాల్సి ఉందన్నారు.  జిల్లాలో ఇంకా సుమారు 2 వేల అర్జిలకు చెందిన సోషల్ ఆడిట్ ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాల్సి ఉందని5, వెంటనే మండల స్థాయి అధికారులు ఆమేరకు నివేదికలు అప్లోడ్ చెయ్యాలని మాధవీలత స్పష్టం చేశారు.జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, స్పందన అర్జీలలో రీ ఓపెన్ అర్జీల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. రీ ఓపెన్ కేసుల్లో ఎక్కువగా రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యుత్ తదితర అంశాలకు చెందినవి ఉన్నట్లు తెలిపారు. అర్జిల పరిష్కారం తో పాటు ప్రజల యొక్క సంతృప్తి స్థాయి కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క అర్జిని నిర్ణీత సమయం లోగా పరిష్కారం చెయ్యాలని, కాలపరిమితి ముగిసిన వాటికి చెంది అధికారుల నుంచి వివరణ కోరడం జరుగుతుందని జేసీ స్పష్టం చేశారు.స్పందన లో కొన్ని ఆర్జిలు:కడియం మండలం వేమగిరి గట్టు కు చెందిన ఎస్. త్రివేణి ఎం పిపి స్కూల్ వంట మనిషిగా విధులు నిర్వర్తించే వారు.. తగినంత విద్యార్థులు లేని కారణంగా విధుల నుంచి తొలగించడం జరిగిందని, తగిన న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ జిల్లా విద్యా అధికారిని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మూడో సోమవారం జిల్లా అధికారులు, పోలీసు అధికారులతో కూడి ప్రత్యేక స్పందన కార్యక్రమంలో అన్ని స్థాయి ల్లోని జిల్లా స్థాయి అధికారులు విధిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారుల తరపున రెండవ స్థాయి అధికారులు ఆయా మండలాల్లో హాజరు కావాలని పేర్కొన్నారు.దేవరపల్లి యాదవోలు సర్పంచ్ సున్నం నాగ వరప్రసాద్ గ్రామ వి ఆర్ ఏ నుంచి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి జాయింట్ కలెక్టర్ ద్వారా విచారణ జరిపి, సంబంధిత వి ఆర్ ఎ కరటూరి తాతా రావు నుంచి సంజాయిషీ కై ఆదేశించడం జరిగింది.కాతేరు కి చెందిన దివ్యాంగులు గరికిన ఏలేశ్వరరావు చేపల వేట వృత్తి చేసుకుంటున్నానని, తన కు సహాయంగా తన పిల్లలు రావడం తో వారిని స్కూల్ కి పంపండం కుదరటం లేదని, తగిన 4జీవనభృతి కై కోరడం జరిగింది. కలెక్టర్ స్పందించి మార్కెటింగ్ అధికారులు , మత్స్య శాఖ అధికారులు స్థానిక మార్కెట్ యార్డ్ లో షాప్ కేటాయింపు, వ్యాపార విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నల్లజర్ల మండలం పోతినీడు పాలెం కు చెందిన పి. చిరంజీవి లేటు గంగయ్య కుమారులకు చెందవలసిన ప్రభుత్వ పట్టా భూమి వేరే వ్యక్తి స్వాధీనం చేసుకుని భూ బదలాయింపు కోసం రికార్డులు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు అర్జి ఇచ్చారు. తహశీల్దార్ తక్షణం రికార్డులు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.తాళ్లపూడి మండలం మలకపల్లి కి చెందిన కో ఆపరేటివ్ బ్యాంకు స్థలం అన్యాక్రాంతం అయినట్లు, జిల్లా సహకార అధికారి ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని కొండేపూడి తాతారావు అర్జి ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ, డిసిఓ క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి, సహకార సంఘం మార్గదర్శకాలు మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నల్లజర్ల మండలం అనుమునిలంక కి చెందిన పి. విజయ రావు చిపూరి గూడెం లోని ఆర్ ఎస్ 147/3 కు చెందిన వ్యవసాయ భూమి ఆక్రమణ పై విచారణ కోరుతూ పోలీసు అధికారికి ఆర్జి అందచేశారు.రంప ఎర్రంపాలెం రైతు కూలీ సంఘం నాయకులు గొలి ముసలయ్య తదితరులు సుందరమ్మ సంత్రం మిగులు భూమి 15.50 ఎకరాలకు వేలంపాట నిర్వహించాలని అర్జి అందచేశారు. గతంలో జరిగిన వేలం పాట కు టెండర్ దాఖలు చేసిన గుత్తేదారు అదే రోజు డిపాజిట్ చెల్లించనందున, తదుపరి హెచ్చు దారులైన ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వారికి అప్పగించాల్సి ఉండగా నేటికీ ఆప్రక్రియ జరగనందున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నివేదిక అందచేయాలని ఆదేశించడం జరిగింది.పెరవలి మండలం అన్నదేవర పేట గ్రామంలో ఎస్సీ లకు చెందిన బహిర్భూమిని వైసిపి మద్దతుదారులు అని చెప్పుకొని కొందరు అధికారుల మద్దతు తమకే ఉందని అన్యాక్రాంతం కోసం ప్రయత్నం చేస్తున్నారని, ఎస్సీ లకు చెందిన కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం తమకు కేటాయించాలని వి. దొరబాబు, కే. శ్రీను తదితరులు కలెక్టర్ కి అర్జి అందచేశారు. పెరవలి తహశీల్దార్ తగిన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.స్పందన లో పాల్గొన్న జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, డి ఎల్ ఎస్ ఏ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *