– ఈరోజు వొచ్చిన స్పందన అర్జీలు 14
-స్పందన,జగనన్న సురక్ష ద్వారా వచ్చిన ప్రజల సమస్య లకు త్వరిత గతిన పరిష్కారం.
-మునిసిపల్ కమీషనర్,
-కె.దినేశ్ కుమార్.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ఆర్జీల ను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలని మునిసిపల్ కమీషనర్, కె.దినేష్ కుమార్ అన్నారు.
సోమవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు నుండి స్పందన అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో మొత్తం ప్రజల నుండి 14 అర్జీలు వచ్చాయని తెలిపారు. స్పందన లో వచ్చిన దరఖాస్తులకు వెంటనే స్పందించి అధికారులు అర్జీదారునికి పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అర్హత ఉండి సంక్షేమ పథకాలు అమలు కానీ వారిని జగనన్న సురక్ష ద్వారా గుర్తించి ఆ పథకాలు అమలు చేయడం జరుగు తోందన్నారు. ప్రజా సమస్య ల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ పి యం సత్యవేణి, సిటీ ప్లానర్ వైబీఆర్ చంద్రబోస్, ఇతర మునిసిపల్ అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News