Breaking News

 డెంగ్యూ,మలేరియా ప్రభలకుండా దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి…


– ఆగస్ట్ 20 ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా నేడు పోస్టర్ ఆవిష్కరణ
– కలెక్టర్ మాధవీలత
– జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు మానవాళి పై శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు కారణమయ్యే దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ దోమల దినోత్సవం  సందర్బంగా దోమల నివారణ పై గోడ పత్రికను, కర పత్రాలను కలెక్టర్ మాధవీలత జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ , వైద్యశాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పురపాలక, పంచాయితీ అధికారుల సమన్వయంతో దోమలు లార్వా నియంత్రణ చర్యలు చేపడుతున్నా మన్నారు. దోమల నివారణే లక్ష్యం గా జిల్లాలో వివిధ సంక్షేమ వసతి గృహాల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఏసిఎమ్ ద్రవాన్ని పిచికారీ చేయిస్తున్నా మన్నారు. 50 వేల “గంబూషియా” లను దోమలను నివారించేందుకు హై రిస్క్ ప్రాంతాలల్లో , పెద్ద మొత్తంలో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలలో విడిచిపెట్టుటకు ప్రణాళిక ను సిద్ధం చేసామన్నారు. ఈ సీజనల్ మలేరియాకు సంబందించిన యాంటీ మలేరియా మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఉప కేంద్రాలలో అందుబాటులో ఉంచామన్నారు. జ్వరంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వారికి మలేరియా నిర్దారణ పరీక్షలు జరిపి సరి అయిన మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నదన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని, పడుకునేటప్పుడు దోమతెరలు తప్పనిసరిగా వాడాలన్నారు.    కీటకనాశిని మందు పిచికారీ తప్పనిసరిగా చేయుంచడం జరుగుతుందన్నారు. పిల్లల చేతులకు , కాళ్లకు నిండుగా ఉండే దుస్తులు వేయాలన్నారు. అనారోగ్యం తో బాధపడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా సొంత చికిత్స కాకుండా దగ్గరలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకొవాలనిసూచించారు. వైద్యులు సూచించిన మేరకు మందులు తప్పనిసరిగా వాడటం వంటి జాగ్రత్తలుతీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆడ దోమ కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుందన్నారు. మలేరియా దోమ ఉనికిని బ్రిటిష్ డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్ 1897 వ సంవత్సవరంలో కనుగొన్నారని, వారి జ్ఞాపకార్ధం ప్రతి ఏడాది ఆగస్టు 20 వ తేదీ ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటు న్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.డిఎంహెచ్ ఓ డా. కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2020 సంవత్సరం నుండి తూర్పు గోదావరి జిల్లాలో మలేరియా జ్వరాలు తగ్గుతూ వస్తున్నాయన్నారు. జిల్లాలో మలేరియా కేసులు గణాంకాలు వ్యక్త పరుస్తూ 2020లో 9 కేసులు, 2021లో 3 కేసులు, 2022లో 2 కేసులు, 2023 లో ఇంతవరకు 4 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు.అదే విధంగా డెంగ్యూ కేసులు.. 2020లో 11 కేసులు, 2021లో 199 కేసులు , 2022లో 226 కేసులు, 2023 లో ఇంతవరకు 33 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మలేరియాకు, డెంగ్యూ నిర్థారణ పరీక్ష కిట్స్, మందులు అందుబాటులో ఉంచి రోగులకు అందిస్తున్నామన్నారు. రోజు విడిచి రోజు జ్వరం వచ్చుట, వణుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టండం, తలనొప్పి, ఒంటి నొప్పు లు, వాంతులు, తీవ్రమయిన కేసులలో ఫిట్స్, అపస్మా రక స్థితి వంటివి మలేరియా వ్యాధి లక్షణాలు కావచ్చున్నని పేర్కొన్నారు. అటువంటి సమయాల్లో ఎటువంటి నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఆర్వో జీ నరసింహులు, జిల్లా అధికారులు, వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *