గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి స్పందనకు అందే ఫిర్యాదులు నిర్దేశిత గడువులోగా పరిష్కారం అయ్యేలా విభాగాధిపతులే నేరుగా పరిశిలించి పరిష్కరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ పెద్ది రోజా సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి జగనన్నకు చెబుదాం కు అందే ఫిర్యాదులను భాధ్యతతో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను ఆయా విభాగాధిపతులు పరిశీలించాలని, విభాగాల వారిగా జగనన్నకు చెబుదాం అర్జీలకై ప్రత్యేక సిబ్బందిని కేటాయించుకోవాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శులు విభాగాల వారిగా తమ సచివాలయం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటలనుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ వార్డ్ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు.సోమవారం నిర్వహించిన స్పందనలో 25 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 7, ఇంజినీరింగ్ విభాగం 11, రెవెన్యూ విభాగం 5, ప్రజారోగ్య విభాగానికి సంబందించి 2 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, డి.రవీంధ్ర, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, బయాలజిస్ట్ మధుసూదన్, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, ఏసిపిలు, ఈఈలు, యస్.యస్ లు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News