– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-32 వ డివిజన్ 230 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఒరవడిని సృష్టించారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 32 వ డివిజన్ 230 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతుశైలజారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణితో కలిసి అయోధ్యనగర్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. 271 గడపలను సందర్శించి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలపై ప్రజలను ఆరా తీశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ఈ ప్రాంతం ఎంతగానో మార్పు చెందిందని స్థానికులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుని దుశ్శాలువలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నిరంతరం ప్రక్రియగా కొనసాగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. అనంతరం ప్రజలతో మమేకమై గ్రీవెన్స్ స్వీకరించారు. కూలిన సైడ్ డ్రెయిన్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు.
బీసీల గూర్చి మాట్లాడే నైతిక అర్హత లోకేష్ కి లేదు
బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత నారా లోకేష్ కి, తెలుగుదేశం నాయకులకు ఏమాత్రం లేదని మల్లాది విష్ణు అన్నారు. గతంలో 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని విమర్శించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా సామాజిక న్యాయం అమలు చేస్తూ.. అన్ని పదవుల్లో బీసీలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. 55 మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా స్థానం కల్పించి, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారన్నారు. ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లగా, మున్సిపల్ చెర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ లో చెప్పిన దానికంటే మించి సామాజిక న్యాయం అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలకు 56 సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మల్లాది విష్ణు తెలిపారు. ఆలయాల నిర్వహణలో తమకు తగిన స్థానం కల్పించాలని కోరిన నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను ఆనాడు చంద్రబాబు తీవ్రంగా అవమానించారని మల్లాది విష్ణు గుర్తుచేశారు. తోకలు కత్తిరిస్తానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించడాన్ని నాయీ బ్రాహ్మణ సోదరులు నేటికీ మర్చిపోలేరన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో.. నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించేలా ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు అవమానాలు ఎదురవగా.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆత్మగౌరవం పెరిగిందని తెలియజేశారు.
ర్యాలీని జయప్రదం చేయండి
వైనాట్ 175 నినాదంతో ఈ నెల 23న నిర్వహించనున్న బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక నగర సమగ్రాభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని.. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి వ్యవస్థ, పార్కులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, శానిటేషన్ కార్యాలయాలు, సచివాలయ భవనాల నిర్మాణాలతో నగర రూపురేఖలలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు వివరించారు. కానీ ఈ ప్రభుత్వం వేసిన రోడ్లపై పర్యటనలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా లోకేష్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగేలా ర్యాలీ ద్వారా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ కి సంబంధించి సత్యనారాయణపురం గాయత్రీ కన్వెన్షన్ హాల్ నుంచి సాయంత్రం 3 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని.. కనుక అన్ని వర్గాల ప్రజలు తమ మద్ధతు తెలియజేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మరీముఖ్యంగా విజయవాడ నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగనుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, ఒగ్గు గవాస్కర్, పేరం త్రివేణి రెడ్డి, శ్యామ్ బాబు, జగన్మోహన్ రెడ్డి, రంగబాబు, ఆదిరెడ్డి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News