-ఇకపై ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల కోసం స్పందన
-జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్పందన(గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉద్యగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ డిఆర్వో నరశింహులతో కలసి ఉద్యోగుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈసందర్బంగా జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తెలుసుకొని వాటిని పూర్తి స్థాయిలో పరిష్కారం చేసేందుకు ప్రతి మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో ఉద్యోగుల గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసామన్నారు. ఈ రోజు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి 11 అర్జీలను స్వీకరించామని జాయింట్ కలెక్టరు అన్నారు. సంక్షేమ పాలనలో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి భరోసా కలుగ చెయ్యడం ఈ ప్రత్యేక స్పందన ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. సర్వీస్ మేటర్, పదోన్నతులు, ఇతర సమస్యలను తెలుసుకుని ఆ మేరకు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. వాటిలో ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావలసిన వాటిని ఆయాశాఖాధిపతులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు.వచ్చిన కొన్ని అర్జీలు :-రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నందు1993 సెప్టెబరు 26 వ తేదీ నుంచి నిర్మితి కేంద్రం రాజమహేంద్రవరం కార్యాలయంలో ఎన్ ఎమ్ ఆర్ గా విధులు నిర్వహిస్తున్నానని, ఎస్ఎస్ఆర్ రేట్లను అనుసరించి రూ. 525/-లు మాత్రమే చెల్లిస్తున్నారని, 1993 నవంబరు 25 వ తేదీకు ముందు జాయిన్ అయిన వారికి పుల్ టైమ్ స్కేల్ ఇవ్వవలసిందిగా జీవో06 పొందుపరిచి ఉందని, కావున నా అర్జీని పరిశీలించి పుల్ టైమ్ స్కేల్ ఇప్పించాల్సింది పీవీ సత్యనారాయణ అర్జీలో పేర్కొన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ అర్జీని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ శాఖ పీడీని ఆదేశించారు.ధవలేశ్వరం ఏపి బాలయోగి గురుకుల జూనియోర్ కళాశాలలో పనిచేస్తున్న జి. రామరెడ్డి తమ అర్జీలో సంపాదిత సెలవు నగదు మంజూరు కొరకు (ఎరన్డ్ లీవ్) రు.1,20,552/-లు గత మూడేళ్ళ క్రితం ధరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటి వరకు నగదు మంజూరు కాలేదని, సీఎఫ్ ఎం ఎస్ నందు పెండింగ్ లో ఉన్నందని క్లీరెన్స్ అయిన తదుపరి మాత్రమే నగదు వస్తుందని తెలియజేస్తుంది. కావున అధికారులు నా సంపాదిత సెలవును నగదు ఇప్పించి ఆదుకోవాలని వారు అర్జిలో కోరారు.బిక్కవోలు మండలం కొంకుదురు శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానంలో అటెండరు గా విధులు నిర్వహించి పదవీవరణ చేసిన వెల్ల సత్యనారాయణ తమ అర్జీలో తనకు రావలసిన పెన్షన్, రిటైర్మెంట్ గ్రాట్యూటీ, మెడికల్ రిఇంబర్సుమెంట్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై జేసీ ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనరు వారికి సూచిస్తూ అర్జీదారుని సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహం, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓ లు ఎస్. మల్లిబాబు, ఎ. చైత్రవర్షిణి, సిపివో ఏ. ముఖ లింగం, ఎస్ ఈ పిఆర్ ఏ బి వి ప్రసాద్, పీడీ డ్వామా పి. జగదాంబ, డా ఎస్ జి టి సత్య గోవింద్, ఎస్ ఈ ఆర్ అండ్ బి ఎస్ బి వి రెడ్డి, డి ఎస్ వో పి. విజయ భాస్కర్, మార్కెటింగ్ ఏ డీ ఏం.సునీల్ వినయ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి, కే ఎస్ జ్యోతి, ఆర్టీసి డి టి వో షర్మిలా అశోక్, డి.ఎమ్.హెచ్.వో. డా కె. వేంకటేశ్వర రావు, డి ఐ పిఆర్వో సిహెచ్. శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా బి. రమేష్, డి ఈ వో ఎస్. అబ్రహం, ఇతర జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News