-అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేయాలి.
-అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో కేటాయించిన పనులు పూర్తి చేయాలి.
– జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 30 వ తేదీ నిడదవోలు పట్టణంలో నిర్వహించే “వైస్సార్ కాపు నేస్తం” రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు.స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపధ్యంలో ముందస్తు ఏర్పాట్ల పై జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డిఆర్వో జి. నరశింహులు లతో కలసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ ఈనెల 30 వ తేదీ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నిడదవోలు పట్టణంలో నిర్వహించనున్న “వైస్సార్ కాపు నేస్తం”రాష్ట్ర స్థాయి వేడుకల్లో పాల్గొంటారన్నారని పేర్కొన్నారు. సీయం పర్యటనకు సంబందించి వివిధ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తమకు కేటాయించిన విధులను బాధ్యతా యుతంగా నిర్వహించాలన్నారు. ఎటువంటి సంఘటనలు జరిగేందుకు తావులేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబందించి రోడ్ షో లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అల్పాహారం, త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. అధికారులకు ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటనకు సంబందించి గత అనుభవం ఉందని ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక మేరకు విజయవంతం చేయాలన్నారు. ఈ పర్యటనలో హెలీప్యాడ్ నుండి సభా వేధిక వరకు రోడ్ షో లోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభా వేదిక వద్ద గ్యాలరీల నందు ప్రజలు, లబ్దిదారులకు వాటర్ ప్యాకెట్స్, అల్పాహారం, తగిన మెడికల్ క్యాంపులు సిద్దం చెయ్యాలని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్దం చేయాలన్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని అందుకు తగిన జాగ్రత్తలు అవసరం అన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని పేర్కొన్నారు. హేలీప్యాడ్ నుంచి సభా వేదిక వరకు రోడ్ షో లో ముఖ్యమంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ సీయం పర్యటన చేయనున్న దృష్ట్యా అత్యంత భద్రతా ఏర్పాట్ల తో పాటు తగిన జాగ్రతలు తీసుకోవాలని జాయింట్ కలెక్టరు సూచించారు. రహదారి పొడవునా ఎక్కడా ఎటువంటి బ్లాక్ హోల్స్ లేకుండా చూడాలని, రోడ్ కి ఇరువైపులా బ్యారిగేట్స్ ఏర్పాటు చెయ్యాలని ఆర్ అండ్ బి అధికారులకు, మునిసిపల్ అధికారులకు సూచించారు. మెడికల్ క్యాంపులు రోడ్ షో, సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చెయ్యాలని, అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇదేరోజు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు కుమార్తే వివాహా వేడుకలకు రాజమండ్రి హోటల్ మంజీరాకు రానున్న సమాచారం ఉన్నందున ఆర్ట్స్ కళాశాలలో మైదానంలో హెలీప్యాడ్ ను సిద్దం చేస్తున్నామని తెలిపారు.జిల్లా అదనపు ఎస్పీ జి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ప్రజలు, పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని అందుకు అనుగుణంగా రోప్ పార్టీ, సెక్యూరిటీ పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రోడ్ షో మేరకు బ్యారికెడ్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ కోసం ఆయా మార్గాలలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహం, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓ లు ఎస్. మల్లిబాబు, ఎ. చైత్రవర్షిణి, అదనపు ఎస్పీజి.వెంకటేశ్వర రావు, సిపివో ఏ. ముఖ లింగం, ఎస్ ఈ పిఆర్ ఏ బి వి ప్రసాద్, పీడీ డ్వామా పి. జగదాంబ, డా ఎస్ జి టి సత్య గోవింద్, ఎస్ ఈ ఆర్ అండ్ బి ఎస్ బి వి రెడ్డి, డి ఎస్ వో పి. విజయ భాస్కర్, మార్కెటింగ్ ఏ డీ ఏం.సునీల్ వినయ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి, కే ఎస్ జ్యోతి, ఆర్టీసి డి టి వో షర్మిలా అశోక్, డి.ఎమ్.హెచ్.వో. డా కె. వేంకటేశ్వర రావు, డి ఐ పిఆర్వో సిహెచ్. శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా బి. రమేష్, డి ఈ వో ఎస్. అబ్రహం, ఇతర జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News