రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ అనుబంధ ప్రభుత్వ కార్యక్రమాలు, పౌర సేవలు అందించే సామర్థ్యం మరింతగా పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ డివిజన్, మండల స్థాయి అధికారులతో రెవెన్యూ, స్వమిత్వ, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, సేవలు – మ్యుటేషన్, ధాన్యం సేకరణ పై డి ఆర్ వో తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ భూముల హక్కు గుర్తించే ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. స్వమిత్వ కింద 12 గ్రామాలకు చెందిన భూహక్కు దారులకు చెందిన 3,082 పత్రాలు పంపిణీ చెయ్యాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2,604 హక్కుదారులకు అందచేశారని, మిగిలిన వాటిని నెలాఖరు లోగా అంద చెయ్యలన్నారు. జిల్లాలో 1181.835 ఎకరాల 1718 మంది లబ్ధిదారులు క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇంకా 175 ధరఖాస్తు లను పరిశీలించాల్సి ఉందని అన్నారు. మల్టీ పర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్ కోసం 106 స్థలాలు గుర్తించాల్సి ఉండగా 85 చోట్ల గుర్తించడం జరిగిందని, మిగిలిన 21 చోట్ల కూడా అనువైన ప్రాంతం గుర్తించి సేకరణ చేపట్టాలని ఆదేశించారు. నీటి తిరువా వసూళ్ల ను వేగవంతం చేయాలని కోరారు. జిల్లాలో 4,13,56,000 కు గానూ ఇంకా రూ.3,52,50,321 వసూళ్ల చెయ్యాల్సి ఉందని అన్నారు. మ్యుటేషన్ కు చెంది 3,583 దరఖాస్తులు వచ్చాయని, క్షేత్ర స్థాయి లో పరిశీలన చేసి త్వరితగతన పరిష్కారం చెయ్యాలని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ సేకరణ కోసం ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు చేపట్టవలసి ఉందన్నారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News