– జిల్లాలో నూరుశాతం ఈ క్రాప్ నమోదు చేయండి
– మట్టి నమూనాల సేకరణ వివరాలు అందచెయ్యలి
-2022 ఖరీఫ్ సీజన్లో చాగల్లు, తాళ్లపూడి అరటి రైతులకు బీమా పరిహారం అందుచేత
-జేసీ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో పూర్తి స్థాయి కి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.ఖరీఫ్ సీజన్లో అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన నూరు శాతం గన్ని బ్యాగులను ముందస్తుగా అందుబాటులో ఉంచి సేకరణ చెయ్యడం జరుగుతుందని, ఆమేరకు ఇప్పటికే మిల్లర్లతో జరిగిన సమావేశంలో ఆమేరకు స్పష్టత ఇచ్చామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంనకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ , జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు లు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయి లో 4,55,846 మెట్రిక్ టన్నుల ధాన్యం పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కార్యాచరణ సిద్దం చేశామని తెలిపారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ కేవైసి చేసుకోవాలన్నారు . ఈ క్రాప్ నూరుశాతం చెయ్యవలసి ఉందని, ఇందుకు గ్రామం లోని గ్రామ రెవెన్యూ అధికారి, సచివాలయ వ్యవసాయ సహాయకులు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. అర్భికే ద్వారా ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఈ కేవైసి చేసుకున్న వ్యక్తి తప్పని సరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. రైతులకు పూర్తి స్థాయి లో భరోసా ఇచ్చే లా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.జిల్లాలో విస్తృత స్థాయిలో భూ సార పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. వాటి పరీక్షా ఫలితాల వివరాలు త్వరిత గతిన రైతులకు తెలియ చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఏ రైతు అవసరమైన ఎరువులు ఆయా అర్భికెల వద్ద సిద్దం చేసేలా వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో కూడి కార్యాచరణ అమలు చేస్తామన్నారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, సాగునీటి విడుదల చెయ్యడంతో పాటు, పండించిన ధాన్యం కొనుగోలుకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ సలహా మండలి సమావేశం ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు పై చర్చించి, సలహా కమిటీ నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ సిద్దం చెయ్యాల్సి ఉంటుందన్నారు.డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ జిల్లాలో కౌలు రైతులకు పెద్ద ఎత్తున సిసిఆర్ సి కార్డు లను అందచెయ్యడం జరిగిందన్నారు. జగనన్న సురక్ష కింద ఇంటింటి సర్వే సమయంలో నమోదు చేసి అందచేశమన్నారు . జిల్లాలో 88,075 సిసిఆర్ సి కార్డు లు లక్ష్యంకాగా ఇప్పటి వరకు 94,497 అందచేసి నూరుశాతం లక్ష్యాలను సాధించామన్నారు.అర్హత ఉన్న ప్రతి ఒక్క కౌలు రైతు కు సి సి ఆర్ సి కార్డులు అందజేస్తామని తెలిపారు.జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు పనిచేస్తోందని, డ్రోన్ పై పరిజ్ఞానం ఉచితంగా అందిస్తున్న దృష్ట్యా మండల, అర్భికే పరిధిలో గ్రూపు లను గుర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో గత ఖరీఫ్ 2022 లో నష్టాల బారిన పడిన అరటి రైతులకు ప్రభుత్వం బీమా పరిహారం అందించినట్లు, చాగల్లు, తాళ్లపూడి ప్రాంతంలోని అరటి రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారన్నారు. జిల్లాలో సాగు చేసే ప్రతి ఒక్క ఎకరా తప్పని సరిగా ఈ క్రాప్ నమోదు చేసుకుని ఆమేరకు ప్రయోజనం పొందాలని కోరారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. పురుగుల మందు, ఎరువులు , మట్టి నమూనా పరీక్షలు వివరాలు, నిడదవోలు పుంత రోడ్డు, జల్ల కాలువ మరమ్మత్తులు, ఎర్ర కాలువ గండ్ల రిపేర్లు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది.సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే తేజా, జి. జనార్ధన రావు, ఆదర్శ రైతులు ఎం.నరసింహారావు, డి. రామకృష్ణ, పీ. శ్రీనివాసరావు, సత్యనారాయణ, వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎమ్. నంద కిషోర్, ఇతర వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు హార్టికల్చర్ అధికారి వి.రాధాకృష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ (మైక్రో ఇరిగేషన్) కే .స్వాతి , జెడి (మత్స్య) కృష్ణా రావు, డి వి హెచ్ వి ఎస్టీజి సత్య గోవింద్, ఇతర అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News