రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి “జగనన్న విద్యా దీవెన” పథకం క్రింద వివిధ కేటగిరీలలోని 30,729 విద్యార్థులకు సంబందించిన 27,830 మంది తల్లుల ఖాతాలకు రూ. 22,43,47,773/లు జమ చేయడం జమ చేశామని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు.సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా నగరి నుంచి రాష్ట్ర స్థాయి విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి విద్యార్థుల తల్లులు ఖాతా లకు 3వ త్రైమాసిక లబ్దిని జమ చేశారు. స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్బంగా కలెక్టరు డా. కే.మాధవీలత మాట్లాడుతూ తల్లితండ్రుల పేదరికం పిల్లల చదువులకు వారి భవిష్యత్తుకు అడ్డుకాకూడదనే లక్ష్యంతో వారి ఉన్నత చదువులకు తోడ్పాటునిస్తూ ప్రతి మూడు మాసాలకు ఒకసారి జగనన్న విద్యాదీవెన క్రింద త్రైమాసికపు ఫీజురింయబర్సు మెంట్ ను విద్యార్థుల తల్లుల ఖాతాలకు రాష్టప్రభుత్వం జమచేస్తుందని పేర్కొన్నారు. మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య ఒక్కటేనని, విద్యా రంగంలో అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఏ ఒక్క విద్యార్థి చదువు మానకుండా ఉన్నత విద్య వరకు చదువుకునే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి పథకాలు అమలు చేస్తుందన్నారు. నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మి వ్యక్తి మన సిఎం అన్నారు. విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేయడం జరిగిందన్నారు.ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి “జగనన్న విద్యా దీవెన” పథకం ద్వారా జిల్లాలో…ఎస్సి సంక్షేమం కింద 6402 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 4.81 కోట్లు, ఎస్టి సంక్షేమం కింద 177 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 9.37 లక్షలు, బిసి సంక్షేమం కింద 13440 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.9.28 కోట్లు, ఈబిసి కింద 3538 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.3.12 కోట్లు, ముస్లిం మైనారిటీ కింద 655 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.49.15 లక్షలు, కాపు సంక్షేమం కింద 6345 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4.50 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీ కింద 172 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13.27 లక్షలు, జిల్లాలో మొత్తం 30,729 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 22,43,47,773/-లు జమ చేసామన్నారు.జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం.సందీప్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన క్రింద ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.103.21 విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్, గిరిజన సంక్షేమాధికారిణి కె. జ్యోతి, బీసీవెల్ఫేర్ అధికారి పి. సత్య రమేష్, వివిధ కళాశాల విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News