Breaking News

“జగనన్న విద్యా దీవెన” విద్యార్థుల అభిప్రాయాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నా చదువుకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో ఉపయోగపడిందని రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న కాలి తేజ వివరించారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషించడమే కష్టంగా కుటుంబాల్లో ఉన్న మాకు ఉన్నత చదువులు అవకాశం లేదని, ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి జగనన్న గొప్ప మనస్సుతో మేము కూడా చదువుకోచ్చు అనే విధంగా భరోసా ఇస్తూ “జగనన్న విద్యా దీవెన” ద్వారా ఆర్థిక సహాయం చేయడం వలన మా చదువుకు ఎటువంటి ఆటకం లేదన్నారు. రాజమహేంద్రవరం ఎస్సీ హాస్టల్ -1లో ఉంటూ ఆర్ట్స్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాన్నారు. ఇటీవలి మా తండ్రిగారు మరణించిప్పుడు కూడా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి చేయూతను అందించడమే కాకుండా మా అమ్మకు వితంతు పింఛన్ కూడా నెల నెల అందిస్తున్నారన్నారు. చదువు సాగదేమో అన్ని నాకు జగనన్న విద్యా దీవెన ద్వారా ఉన్నత విద్యను అభ్యశించడం చాలా సంతోషంగా ఉందన్నారు.విద్యార్థిని.. తాడి చరిత..రాష్ట్ర ముఖ్యమంత్రి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలన్న సంకల్పంతో మాకు మావంటి పేద కుటుంబాల వారికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా ఎంతో ఆర్థిక చేయూతనిస్తూ ఆదుకుంటున్నట్లు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న తాడి చరిత తన అభిప్రాయాన్ని తెలిపారు. మా తండ్రి వ్యవసాయ కూలి మా నాన్న సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోదు, ఆర్థిక స్తోమతలేని మాలాంటి వారికి జగనన్న విద్యాదీవేన, వసతి దీవెన ద్వారా భరోసా కల్పిస్తూ చదివించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.కొణతల సుధాకర్ తల్లి.. సౌజన్య ..నా పేరు కొణతల సౌజన్య, మాది బొమ్మూరు గ్రామం.. మా అబ్బాయి కొణతల సుధాకర్ ధవళేశ్వరం కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. గత మూడేళ్లగా నా కుమారునికి విద్యాదీవెన పథకం ద్వారా ఫీజురింబర్సుమెంట్ పడుతోంది. ఫీజులు చెల్లించి చదివించే ఆర్థిక స్తోమత మాకు లేదు. మలాంటి పేద వర్గాల వారి పిల్లలకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక భరోసా గా విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రాయితీ అందజేస్తూ చదువుకునే అవకాశం కల్పించడం గొప్ప వరంగా భావిస్తు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీయం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *