Breaking News

స్పందనలో 19 అర్జీలు… : మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి సేవలు అందించాలని ఆదేశించారురోడ్డు స్థలం ఆక్రమించుట, పారిశుద్యం, వీధి దీపాలు, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ   వంటి  తదితర అంశాలపై 19 వినతులు స్వీకరించామన్నారు.స్పందనలో వొచ్చిన కొన్ని అర్జీలు:34 వ వార్డు కి చెందిన గోవింద రాజులు తన అర్జిలో ప్రక్క ఇంటిలో వంటలు వండే వారి వలన నీటి వినియోగం ఎక్కువగా చేస్తున్నారని, డ్రైనేజీ వ్యవస్థ మార్పు చేయవలసినదిగా కొరియున్నారు.న్యూడిల్స్ వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న జీ. వెంకన్న తన అర్జిలో టౌన్ ప్లానింగ్ వారు నా బండి తీసివెయ్యలని ఆదేశించి యున్నారు. నా కుటుంబానికి ఇదే జీవనాధారం కావున ట్రాఫిక్ కి ఆటంకం లేకుండా వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.బాబా నగర్ కు చెందిన ఏం. జ్యోతి 6, 7 రోడ్ లకు చెందిన ఉన్న మా స్థలానికి దారి లేకుండా 7 వ రోడ్ ఆక్రమణ కు గురైంది. ఇందు వల్ల 2.5 ఎకరాల స్థలం లో 17 ప్లాట్స్ నిరుపయోగంగా మారాయి. సమస్య పరిష్కారం కోసం కోరడం జరిగింది.ఆదర్శ నగర్ పార్క్ వాకర్ అసోసియేషన్ వారు ఇటీవల కురిసిన వర్షాలకు పార్కు లో వాకింగ్ ట్రాక్ బురదమయం గా మారిందని అర్జి అందచేశారు. వాకింగ్ ట్రాక్ శుభ్ర పరచడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.స్పందనలో సిటీ ప్లానర్ వై బి ఆర్ చంద్రబోస్, డిప్యూటీ కమిషనర్ కె. సాంబశివ రావు , సూపరింటండెంట్ ఇంజినీర్ జీ. పాండురంగ రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *