Breaking News

జగనన్న ఆరోగ్య సురక్ష గ్రామ వైద్య శిబిరాల షెడ్యూల్ కి 20 రోజుల ముందే సర్వే పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ జే ఏ ఎస్, ఎలక్షన్స్, హౌసింగ్, జే కే సీ లపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 164 గ్రామ ఆరోగ్య కేంద్రాలు, 21 పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష గ్రామ వైద్య ఆరోగ్య శిబిరాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 30 న 17 క్యాంపులను , అక్టోబర్ నెలలో 328 , నవంబర్ నెలలో 38 క్యాంపు లను నిర్వహించనున్న దృష్ట్యా ఆమేరకు క్యాంపులకు 20 రోజుల ముందే ఇంటింటి సర్వే పూర్తి చెయ్యలన్నారు. కోరుకొండ 26.3 శాతం, అనపర్తి 26.5 శాతం, రాజమండ్రి రూరల్ 28.6 శాతం, రాజానగరం 30.4 శాతం మేర మాత్రమే ఇంటింటి సర్వే పూర్తి చేసినట్లు మిగిలిన లక్ష్యాలను ప్రణాళిక ప్రకారం పూర్తి చెయ్యాలని ఆదేశించారు.ఎలక్షన్ అంశంపై సమీక్ష చేస్తూ, పెండింగ్ ఫారం లను నిర్ణీత సమయం లో పరిష్కారం చెయ్యాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఏడురోజుల లోగా పరిష్కారం చేయవలసినవి 2902 దరఖాస్తులు ఏడురోజుల పై బడినవి 6598, 15 రోజులకు మించినవి 248, 30 రోజులకు పైబడినవి 272 , 45 రోజులు పైబడినవి 449 దరఖాస్తులు పరిష్కారం చెయ్యాల్సి ఉన్న దృష్ట్యా ఈఆర్ఓ లు ప్రణాళిక మేరకు పరిష్కారం చెయ్యాలని అన్నారు.హౌసింగ్ పై సమీక్ష చేస్తూ 14009 ఇళ్ల నిర్మాణం కోసం , స్టేజ్ కన్వర్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. సోప్ పిట్స్ కూడా సమాంతరంగా చేపట్టాలని, ఎంపిడివో లు ఆమేరకు పనులు పూర్తి చేసేందుకు పరిపాలన ఆమోదం ఇవ్వాలని స్పష్టం చేశారు . జగనన్నకు చెబుదాం పెండింగ్ అర్జీలను 24 గంటల్లోగా చూసి, వారం లోగా పరిష్కారం చెయ్యాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో డి ఆర్వో జీ. నరసింహులు, ఇతర జిల్లా అధికారులు, జూమ్ ద్వారా డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *