-జూనియర్ జాతీయస్థాయి పోటీల బ్రోచర్ విడుదల
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో అక్టోబర్ 15 నుండి 19వ తేదీ వరకు స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో 18వ జూనియర్ జాతీయస్థాయి సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ నిర్వహించడం శుభపరిణామమని జిల్లా కలెక్టర్ డిల్లీ రావు అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జూనియర్ జాతీయస్థాయి సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులకు మంచి ఆతిధ్యం ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. పోటీలకు తాను కూడా హాజరు అవుతానన్నారు. అనంతరం అహ్మదాబాద్ లో 27 నుండి 29వ తేదీ వరకు జరుగనున్న ఫెడరేషన్ కప్ కు వెళ్ళే ఆంధ్రప్రదేశ్ మహిళ సాఫ్ట్ టెన్నిస్ జట్టు క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫెడరేషన్ కప్ లో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పేర్కొన్నారు. క్రీడాకారులను వారి యొక్క వివరాలను జిల్లా కలెక్టర్ డిల్లీరావు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ దారం నవీన్ కుమార్, క్రీడా ప్రాధికార సంస్థ సీఈఓ యు.శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ ఎస్.ఏ.అజీజ్, టెన్నిస్ కోచ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News