విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాన్యువల్ స్కావెంజర్స్ ద్వారా పారిశుధ్య పనులు నిర్వర్తించని జిల్లాగ గుర్తించడం జరిగిందని, అటువంటి కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను అన్నారు.స్థానిక కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థ నిర్మూలనపై సంబంధిత అధికారులతో జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ఢిల్లీరావు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం – 2013ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని ఇంకను మాన్యువల్ స్కావెంజర్స్ ద్వారా పారిశుధ్య పనులు జరుగుతున్న వివరాలను సేకరించి నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మాన్యువల్ స్కావెంజర్స్ ద్వారా ఎటువంటి కార్యకలాపాలు నిర్వర్తించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 288 గ్రామ పంచాయితీలతో పాటు విజయవాడ నగర పాలక సంస్థ , కొండపల్లి, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు మున్సిపాల్టీలను మాన్యువల్ స్కావెంజింగ్ నిర్వర్తించని వాటిగా ప్రకటించడం జరిగిందన్నారు. మాన్యువల్ స్కావెంజర్స్ ద్వారా ఎటువంటి పనులు నిర్వర్తించాట్లేదని సాంకేతిక పరికరాలతో పారిశుధ్య పనులు నిర్వర్తించడం జరుగుతుందన్నారు. కమీషనర్లు కమ్యూనిటీ, పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా మాన్యువల్ స్కావెంజర్స్ ద్వారా పనులు నిర్వర్తిస్తున్నది లేనిదీ పరిశీలించాలన్నారు. పరిశీలనలో గుర్తించిన వారిని గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం నుంచి పునరావాసం, ఆర్థిక సహాయం కల్పించేలా చూడాలన్నారు. సఫాయి కర్మచారులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనల ప్రకారం వారికి మాస్క్, గ్లౌజులు, షూలు, ఆయిల్, సోప్, హెల్మెట్, సేఫ్టీ ప్యాక్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తదితర 44 రకాల భద్రతా పరికరాలు, సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో సంక్షేమ పంచాయతీ సెక్రటరీలతోను , మున్సిపల్ పరిధిలో శానిటేషన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో, సమావేశాలు నిర్వహించి వ్యవస్థ పై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి.
జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.మంగళవారం స్థానిక పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిలెన్సు అండ్ మోనిటరింగ్ కమిటీ (ఎస్సి, ఎస్టి అట్రాసిటీ) సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చట్ట నిబంధల మేరకు పరిహారం చెల్లింపులో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో ఏప్రిల్ 4, 2022 నుండి ఇప్పటివరకు 139 మంది బాధితులకు చట్ ప్రకారం 1 కోటి 66 లక్షల 58 వేల రూపాయల పరిహారాన్ని చెల్లించడం జరిగిందన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల మంజూరులో జాప్యం లేకుండా త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. సమావేశంలో జిల్లాలో పోలీస్ కమీషనరేట్ పరిధిలో వెస్ట్, సౌత్, నార్త్ , సెంట్రల్, నందిగామ, తిరువూరు డివిజన్ పరిధిలోను, దిశా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి అండర్ ఇన్వెస్టిగేషన్, పెండింగ్ ట్రయల్ లో ఉన్న కేసులను సమీక్షించి విచారణ త్వరితగతిన పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.బాలకార్మిక నిషేధ చట్టం పటిష్టంగా అమలు చేయండి.జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, బాలకార్మిక (నిషేధ నియంత్రణ) చట్టం ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలలతో పనులు చేయించడం, ప్రమాదకర కర్మాగారాలలో పనులు చేయించడం నిషేధించడం జరిగిందని అటువంటి పనులు నిర్వర్తించే యజమానులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపి ఎం. సత్తిబాబు, ఇంచార్జ్ డిఆర్వో జి. వెంకటేశ్వర్లు, సోషల్ వెల్ఫేర్ డిడి బి. విజయభారతి, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం. రుక్మాంగదయ్యా, సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ బి. సుమిత్ర దేవి, ఏసీపీలు కె. హనుమంతరావు, వివి. నాయుడు, పి. కృష్ణమోహన్, కమిటీ సభ్యులు అర్. జయరాజు, బి. రాజు, కె. రాంబాబు, జె. అనిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News