Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు (రేషనలైజేషన్) సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాకు వివరించారు.రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం సచివాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో సంబంధిత ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు 1,779 పోలింగ్ స్టేషన్లను క్షేత్ర స్థాయిలో సందర్శించి పోలింగ్ స్టేషన్ల యొక్క ప్రాంతం మార్పు ( పోలింగ్ స్టేషన్ లొకేషన్ చేంజ్), పేర్ల మార్పు (నోమెన్ క్లాచర్) తదితర వివరాలను నమోదు చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా పోలింగ్ స్టేషన్ లొకేషన్ మార్పుకు సంబంధించి ఫార్మాట్-1 నందు 164, పేర్ల మార్పుకు సంబంధించి ఫార్మాట్-2 నందు 285, ఫార్మాట్ 3 లో ప్రతిపాదిత రెండు కొత్త పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటుతో మొత్తంగా 1,781 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు ఆమోదానికై పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాకు వివరించారు.వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జ్ డిఆర్వో జి. వెంకటేశ్వర్లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *