రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం వై ఎస్ ఆర్ వాహన మిత్రా పథకం కింద జిల్లాలోని 11,819 వాహనమిత్ర మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.11 కోట్ల 81 లక్షల 90 వేల రూపాయను వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి విజయవాడ విద్యాధరపురం నుంచి శుక్రవారం నిర్వహించే ఐదో విడత వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి వాహన మిత్ర లబ్దిదారుల ఖాతాలకు 2023-24 సంవత్సరానికి సంబందించిన సొమ్ము జమ చేయనున్నారు. జిల్లా స్థాయి వాహనమిత్ర కార్యక్రమం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టరు, అధికారులు పాల్గొంటారు.రాష్ట్ర ముఖ్యమంమత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 సంవత్సరానికి సంబందించి ఐదో విడత 2,75,931 మంది వాహన మిత్ర లబ్దిదారులుకు రూ.275.93 కోట్ల రూపాయలు జమ చేయగా, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 11,819 వాహనమిత్ర మంది లబ్ధిదారులకు రూ.11 కోట్ల 81 లక్షల 90 వేల రూపాయను వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.ఇందులో భాగంగా జిల్లాలో 21953 ఆటో రిక్షాలు, 590 లగ్జరీ టూరిస్టు కాబ్ లు , 670 మాక్సీ క్యాబ్స్, 270 మోబైల్ క్యాబ్స్, 2292 మోటారు క్యాబ్స్ గాను 11,819 మంది లబ్దిదారుల ఖాతాలకు రూ.11 కోట్ల 81 లక్షల 90 వేల రూపాయలను జమ చేయడం జరుగుతుంది.జిల్లాలో 2019-20 సం.రంలో 8,122 మందికి, 2020-21 సం.రం.లో 11,913 మందికి, 2021-22 లో 8446 మందికి, 2022-23 సం.రంలో 11, 233 మందికి జమ చేయగా, ఈ ఏడాది 2023-24 సం.రంలో 11, 819 మంది లబ్దిదారులుకు శుక్రవారం అందించడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఐదో విడత వాహన మిత్ర లబ్దిదారులు నియోజకవర్గాల వారీగా.. అనపర్తి నియోజక వర్గంలో 744 మందికి, రాజానగరం నియోజకవర్గంలో 1752 మందికి, రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో 2636 మందికి, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో2506 మందికి, కొవ్వూరు నియోజకవర్గంలో 1269 మందికి, నిడదవోలు నియోజకవర్గంలో 1529 మందికి, గోపాలపురం నియోజకవర్గంలో 999 మందికి, జగ్గంపేట మండలం గోకవరం మండలంలో 384 మందికి మొత్తం 11819 మంది లబ్దిదారులుకు ఖాతాలకు రూ.11 కోట్ల 81 లక్షల 90 వేల రూపాయలను జమ చేయడం జరుగుతుంది.
Prajavartha Online Telugu News