రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు జగనన్న ఆరోగ్య సురక్ష, రీ సర్వే ఫేజ్ -3 , హౌసింగ్ సవరించిన లక్ష్యాలకు అనుగుణంగా స్టేజ్ కన్వర్షన్ పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో రెవెన్యూ రీ సర్వే, జాతీయ రహదారులు, వ్యవసాయం, డైరీ అభివృద్ధి, చిరు ధాన్యాలు, జగనన్న ఆరోగ్య సురక్ష, పి ఆర్ లో ప్రాధాన్యత భవనాలు, ఉపాధిహామీ, స్వమిత్వ, జేకేసి లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.స్థానిక కలెక్టరేట్ దృశ్య మాలిక సమావేశ మందిరం నుంచి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ వివరాలు తెలియ చేస్తూ, జిల్లాలో భూముల రీ సర్వే కి చెందిన ఫేజ్ -2 లో 54 గ్రామాల్లో ఫైనల్ ఆర్ వో ఆర్, కరెక్షన్ మాడ్యుల్ పూర్తి చేశామన్నారు. సరిహద్దు రాళ్ళు ఏర్పాటు కి చెందిన 53,552 లక్ష్యాలను వంద శాతం సాధించడం జరిగిందన్నారు. ఫేజ్ -2 కు చెందిన 22 (ఏ) లేయార్ మాడ్యుల్ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. ఫేజ్ -3 కి చెంది 90 గ్రామాల్లో రీ సర్వే పనులకు గాను గత 15 రోజుల కు చెందిన 10 గ్రామాలకు చెందిన లక్ష్యాలకు గాను 13 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు.పంచాయతీ రాజ్ కు చెంది జిల్లాలో మూడు పి హెచ్ సి భవనాలు లక్ష్యాలను పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామీణ పరిధిలో కొత్తగా 5 చోట్ల కు సంబంధించి 4 భవనాల నిర్మాణ అగ్రిమెంట్లు పూర్తి చేశామని, పట్టణ పరిధిలో 9 యూ పి హెచ్ సి లకు గాను 5 అందచేశామని, మిగిలిన 4 భవనాలు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.వ్యవసాయ రంగం కు సంబంధించి సమీక్ష లో భాగంగా ఈ కేవైసి కి చెందిన పంటల , రైతుల వివరాలకు జాబితా ప్రకటన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి పంట నమోదు పూర్తి చేసి సామాజిక తనిఖీ కోసం అర్భికెల వద్ద అక్టోబర్ 5 నుంచి 10 వరకు ప్రదర్శిస్తామని తెలిపారు. వాటిపై ఫిర్యాదులను అక్టోబర్ 11 నుంచి 15 వరకు స్వీకరించి, తుది జాబితాను అక్టోబర్ 16 న ప్రదర్శన చేస్తామని అన్నారు.మల్టీ పర్పస్ గోడౌన్ నిర్మాణాలకు సంబంధించి మొత్తం 77 భవనాలకు గాను 56 చోట్ల స్థలాలు గుర్తించి అంద చెయ్యడం జరిగిందని గత వారంలో 4 చోట్ల స్థలాలు గుర్తించినట్లు జేసీ తేజ్ భరత్ వివరించారు.జగనన్న ఆరోగ్య సురక్ష సందర్భంగా రక్తములో హేమోగ్లోబిన్,18 ఏళ్లు నిండిన వారికి బిపి, షుగర్ ఇంటింటి సర్వే సమయంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ క్యాంపు నకు 20 రోజుల ముందు ఆరోగ్య సర్వే చేపట్టడం జరుగుతోందని అన్నారు.హౌసింగ్ కి చెంది మార్పు చేసిన లక్ష్యాల మేరకు 19,253 ఇళ్ళ నిర్మాణాలు కు గాను స్టేజ్ కన్వర్షన్ లో 14,372 ఉన్నాయని, బేస్మెంట్ స్థాయికి ముందు 36,767 ఉన్నాయని రాబోయే రోజుల్లో వాటిని బి ఎల్, ఆర్ ఎల్, ఆర్ సి స్థాయి కి తీసుకుని రావడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా లబ్దిదారుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన చోట ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.జగనన్న పాల వెల్లువ కింద జిల్లాలో స్వల్ప కాలిక రునాలుగా రు 30 వేల నుంచి రూ 50 వేల వరకు 164 మందికి రు.53.12 లక్షలు, దీర్ఘ కాలిక రుణాల కింద రూ.80 వేల చొప్పున ఎనిమిది యూనిట్స్ రూ.6.40 లక్షల మేరకు గ్రౌండింగ్ చేశామని జేసీ తెలిపారు. ఈ నెలలో అమూల్ పాల కేంద్రాల ద్వారా 8 వేల లీటర్ల మేర పాల సేకరణలో పురోగతి సాధించామన్నారు.ఈ సమావేశం లో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఎస్ ఈ ఎస్ బి వి ప్రసాద్, సిపిఓ ఏ. ముఖ లింగం, వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, డ్వామా పిడి పి. జగదాంబ, పిడి డిఆర్దిఏ ఎస్. సుభాషిణి, హౌసింగ్ అధికారి జి. పరశురాం, డిపివో జేవి సత్యనారాయణ, డిసివో వై. ఉమా మహేశ్వర రావు, పశు సంవర్ధక అధికారి డా ఎస్ జీ టి సత్యగోవింద్, కలెక్టరేట్ ఎ వో బివీఎస్ రామా రావు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News