-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ఆధ్వర్యంలో ఇండియన్ స్వచ్ఛత 2.0, స్వచ్ఛతాహి సేవా లో భాగంగా స్వాతంత్ర సమరయోధుల బిల్డింగ్ దగ్గర కాలువ కట్టపైన బందర్ లాకులు వద్ద పేరుకుపోయిన చెత్తను 300 మందికి పైగా స్వచ్చ వారియర్స్ మరియు నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికులు తో కలిసి శుభ్రం చేశారు. స్వచ్ఛత హి సేవ అంటూ నినాదంతో ఇవాళ కాల్వకట్ట పైనున్న చెత్తని మొత్తం పరిశుభ్రంగా చేసి కాలువకట్లను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు.ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ కెనాల్ బండ్స్ సుందరీకరణ, కాలువల ప్రక్కన చెత్త వ్యర్థాలను వేయకుండా జల కాలుష్యాన్ని తగ్గించి, ప్రజల యొక్క జీవితాలకు హాని తగ్గించే విధంగా చెయ్యాలని అన్నారు. కాలువలలో చెత్త, బిల్డింగ్ వ్యర్ధాలను వేయరాదని అలాగే విజయవాడ నగరము నందు ఉన్న మూడు కాలువలను ఎల్లపుడు పరిశుబ్రముగా ఉంచాలని విజయవాడ ప్రజలను కమిషనర్ కోరారు.పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్లు, బయాలజిస్ట్ సూర్య నాయక్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News