Breaking News

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే స్వచ్చ నగరాలు సాధ్యమవుతాయి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ వ్యతిగత భాద్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే స్వచ్చ నగరాలు సాద్యమవుతాయని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బిఆర్ స్టేడియం వద్ద ఉన్న మున్సిపల్ రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ లో స్వచ్చత హి సేవ ఏక్ తారీఖ్ ఏక్ గంట శ్రమదాన్ కార్యక్రమంలో ఎంఎల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి, ఎంఎల్ఏలు మహ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్, డిప్యూటీ మేయర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని కాంప్లెక్స్ పరిసరాలను శుభ్రం చేసి, మట్టి కుప్పలను పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వచ్చ సర్వేక్షణ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆయా నగరాలు, గ్రామాలు స్వచ్చంగా మారుతాయన్నారు. స్వచ్చత అంటే ఒక్కరోజుకే పరిమితం కాకుండా స్వచ్చత భాధ్యతగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు. స్వచ్చత హి సేవలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 485, పట్టణ ప్రాంతాల్లో అన్ని వార్డ్ సచివాలయాల పరిధిలో జరుగుతున్న శ్రమదాన్ విద్యార్ధులు, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని, విద్యార్ధులకు స్వచ్చత పై అవగాహన కల్గితే స్వచ్చ భారత్ సాకారమవ్వడం తేలిక అని అన్నారు. ఎంఎల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన చేస్తారని, స్వచ్చత అంటే మనతో పాటు మన చుట్టు పక్కల వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారమవుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో చెత్త తరలింపుకు ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చారన్నారు. మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడం ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, వార్డ్ సచివాలయాల వారిగా స్వచ్చ నగరంగా గుంటూరుని మార్చుకోవడానికి ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చత హి సేవ ఏక్ తారీఖ్ ఏక్ గంట శ్రమదాన్ లో భాగంగా ఎన్నో ఏళ్ల నుండి నిరుపయోగంగా ఉన్న రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ శుభ్రం చేశామని, త్వరలో కాంప్లెక్స్ ని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. అలాగే కాంప్లెక్స్ లో రెడ్యూస్, రీ సైకిల్, రీ యూజ్ (ఆర్.ఆర్.ఆర్.)సెంటర్ ని ఏర్పాటు చేస్తామని, ఏక్ తారీఖ్ ఏక్ గంట శ్రమదాన్ నగరంలోని వార్డ్ సచివాలయాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయ కార్యదర్శులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. ఎంఎల్ఏ ముస్తఫా మాట్లాడుతూ స్వచ్చత సాధిస్తే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్లల్లో వచ్చే వ్యర్దాలను రోడ్ల మీద, కాల్వల్లో వేయకుండా ఇంటి వద్దకు వచ్చే కార్మికులకే ఇవ్వాలన్నారు. అలాగే కహ్లీ స్థలాలను ఆయా యజమానులు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఎంఎల్ఏ గిరిధర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్పూర్తితో దేశ ప్రదాని చేపట్టిన స్వచ్చ సర్వేక్షణ్ ద్వారా ప్రతి నగరం స్వచ్చ నగరంగా మారుతుందన్నారు. నగర ప్రజలు కూడా నగరపాలక సంస్థకు సహకరించి స్వచ్చ గుంటూరు సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ప్రజలు, విద్యార్ధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమా బాల వజ్రబాబు, షేక్ సజిలా, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్, ఐటిసి ఎంఎస్కె నారాయణ, వాలంటీర్లు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు నూరి ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *