Breaking News

వంతెన మరమ్మత్తు పనులు….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వంతెన మరమ్మత్తు పనుల్లో భాగంగా తొలిదశలో మిల్లింగ్ మెషిన్ తో పాత తారు రోడ్డు నీ తీసివేసే పనులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గోదావరి వంతెన పనులను క్షేత్ర స్థాయి లో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాధవీలత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు అనుకున్న స్థాయిలో జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే మొత్తం లేయర్ క్లీనింగ్, రిమూవింగ్ పనులు పూర్తి చేసి నట్లు తెలిపారు. క్లీనింగ్ చేసి, పాడయిపోయిన సెకండరీ జాయింట్ల వద్ద., గ్లాస్ జియో గ్రిడ్ షీట్లు వేసి, దానిపై 30 ఎమ్ ఎమ్ తారు తో లేయర్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు . జాయింట్ ల వద్ద, ఎత్తు పల్లాలు, వీలయినంత వరకు క్రాక్ లు రాకుండా., ఓకే లెవెల్ లో తారు రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. తదుపరి గ్లాస్ జీ యో గ్రిడ్.. మెటీరియల్ తో పనులను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. నీళ్లు తారు రోడ్డు మీద నిలబడకుండా, డ్రైనేజ్ స్పౌట్లు కొత్తవి తయారు చేసి పెట్టడం జరుగుతుంది. వాటి ద్వారా నీరు క్రిందకు పోయే వీలు ఉంటుందని తెలిపారు . గ్లాస్ జీ యో గ్రిడ్.. మెటీరియల్ షోలాపూర్ నుంచి సోమవారం జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంటే ఆర్ అండ్ బి అధికారులు ఈ ఈ ఎస్ బి వి రెడ్డి, డి ఈ బివివి మధుసూధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *