– వై సి పి ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీని అమలు చేయాలి
–పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
–హెల్త్ కార్డులు,ప్రమాద బీమా కల్పించాలి
– ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కమిటీ,ప్రెస్ క్లబ్ కి నూతన కార్యవర్గం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్సీపి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రెస్ అకాడమీ పాలకవర్గం ఏర్పాటుతో పాటు వృత్తిపరమైన కమిటీలు అన్నిటిని నియమించాలని, రైల్వే పాసులు పునరుద్ధరించాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. ఏపియూడబ్ల్యూజే అర్బన్ అధ్యక్షులు చావారవి అధ్యక్షతన ఆదివారం ఉదయం విజయవాడ గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్ లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ. వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు తూట్లు పొడిచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పాత్రికేయులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. మీడియా , పాత్రికేయులను పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్ను, పత్రిక చట్టాన్ని తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ,వృత్తి పరమైన స్వేచ్ఛను కాపాడే విషయంలో ఏపీయూడబ్ల్యూజే పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు .ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కమిటీ, విజయవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కమిటీ అధ్యక్షులుగా చావా రవి, ఉపాధ్యక్షులుగా ఎం వి సుబ్బారావు, సురేంద్ర కుమార్, కార్యదర్శిగా ఆర్ఎస్ కిరణ్ (వసంత్) కోశాధికారిగా పీవీ శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా జిబి బాబు, జి. శ్రీనివాస్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా యం బురయ్య తో పాటు మరో ఆరుగురిని నూతన కార్యవర్గం గా ఎన్నుకున్నారు ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా కంచల జయరాజ్ ,ఉపాధ్యక్షులుగా ఎం. మురళీకృష్ణ, టి. శివరామకృష్ణ, కార్యదర్శిగా దాసరి నాగరాజు, సహాయ కార్యదర్శిగా ఇ.వి కోటిరెడ్డి, పి.రత్నాకర్ రావు, ట్రెజరర్ గా సయ్యద్ అహ్మద్ హుస్సేన్ తో పాటు మరో ఆరుగురిని గారిని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఎస్.కె.బాబు వ్యవహరించారు..రెండు కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈ సమావేశంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు పైన అజయ్ బాబు,సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.రమణారెడ్డి,ఏ.పి.ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి.రామారావు తదితరులు పాల్గొన్నారు.కొండా రాజేశ్వరరావు కార్యదర్శి నివేదికను,పి.వి శ్రీనివాస్ ఆడిట్ రిపోర్టు సమర్పించారు.ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు ను ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News