-త్వరలో ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ నగర నూతన కమిటీ ఏర్పాటు : పీటర్ జోసఫ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసఫ్ ఆధ్వర్యంలో శనివారం యువజన కాంగ్రెస్ జిల్లా మరియు విజయవాడ నగర కమిటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మరియు జోనల్ ఇంచార్జ్ టి సందీప్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలపై చర్చలు నిర్వహించడం జరిగింది. అలాగే యువజన కాంగ్రెస్ నిర్వహించాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా విధివిధానాల గురించి వివరించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో అతి ముఖ్యమైన కాలం ఎలక్షన్లో చేయవలసిన పనుల గురించి వైసిపి ప్రభుత్వం యొక్క విఫల చర్యలు యువత పడుతున్న నిరుద్యోగ సమస్య మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించి ముఖ్యంగా ఈ మీటింగ్ లో తీర్మానం తీసుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి చేరవేయాలని ముఖ్యంగా యూత్ జోడో బూత్ జోడ ద్వారా యువతను కాంగ్రెస్ వైపు మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు యువతకు అలాగే రాష్ట్రానికి జరిగే ప్రయోజనాల గురించి ప్రజలకు చేరవేయాలని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ నగర యువజన కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుకై కసరత్తు జరుగుతుంది త్వరలో విజయవాడ నగర మరియు ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ ఏర్పడిపోతుందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసఫ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News