విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చేనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సీతానగరం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌లో నిర్వహించబోయే తిరునక్షత్ర మహోత్సవాలకు శనివారం ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆశ్రమ కార్యాలయ నిర్వాహకులు రఘుస్వామి స్వామివారి ముఖ్య శిష్యులు వేద పాఠశాల అధ్యాపకులు మధుగురుస్వామి, మాధవాచారి స్వామి గౌతంరెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ తిరునక్షత్ర మహోత్సవాలకు తాను తప్పక హాజరవుతానని అన్నారు. అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలను గౌతంరెడ్డికి అందజేశారు.
Prajavartha Online Telugu News