Breaking News

ప్యానల్ లాయర్లు మరియు పారా లీగల్ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి వారి ఆధ్వర్యంలో ప్యానల్ లాయర్లు మరియు పారా లీగల్ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పారా లీగల్ వాలంటీర్లు మరియు ప్యానల్ లాయర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని, వారి న్యాయ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి, వివిధ నల్సా పథకాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రమాదంలో ఉన్న పిల్లలు, మహిళలు, కార్మికులు, ట్రాన్స్ జెండర్లు, వృద్ధులు మరియు సామాన్యుల గురించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలపాలని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *