రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్.పి.ఎఫ్ జోనల్ కార్యాలయం నిర్మాణానికి మరియు శిక్షణా సంస్థను నెలకొల్పడానికి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించ వలసినదిగా ప్రతిపాదనలతో రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ డాక్టర్ కె. నరసింహారావు కలెక్టర్ మాధవీలత ను మర్యాద పూర్వకంగా స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కలిశారు. ఈ సందర్భంగా ఎస్.పి.ఎఫ్ జోనల్ కార్యాలయం నిర్మాణానికి మరియు శిక్షణా సంస్థను నెలకొల్పడానికి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించ వలసినదిగా జోన్ కమాండెంట్ డాక్టర్ కె. నరసింహారావు కలెక్టర్ ని కోరారు. రాష్ట్రంలో గల ముఖ్యమైన ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లో ఎస్.పి. ఎఫ్ కీలక భూమిని పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, విమానాశ్రయాలు, బ్యాంకు నగదు భాండాగారాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, ప్రముఖ దేవాలయాలు, ఓ.ఎన్.జి.సి, కాకినాడ యాంకర్ పోర్ట్, రిలయన్స్ కు తమ దళాలు భద్రత కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
Prajavartha Online Telugu News