Breaking News

ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా డొమెస్టిక్ మార్కెటింగ్

-రూ. 50 లక్షలతో ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర లాంజ్
– సీ ఫుడ్ ఇష్టపడే నగర ప్రజలకు ఈ రెస్టారెంట్ ఎంతో అనుకూలం
-జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఆక్వా ఉత్పత్తులు మరియు సముద్ర ఉత్పత్తులు అందుబాటులోనికి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా డొమెస్టిక్ మార్కెటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రోత్సహించడం జరిగినదని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జాంపేట ప్రాంతంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పదకం లో భాగాగం మంజూరైన (PMMSY) యూనిట్ – ఫిష్ ఆంధ్ర లాంజ్ ను జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పదకం లో రూ. 50 లక్షలతో ఫిష్ ఆంధ్ర లాంజ్ యూనిట్ స్థాపనకు 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితిని అందిస్తాయని ఆసక్తి గల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు నగరంలో ఫిష్ ఆంధ్ర లాంజ్ యూనిట్ ను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. సీ ఫుడ్ ఇష్టపడే నగర ప్రజలకు ఈ రెస్టారెంట్ అనుకూలముగా ఉంటుందనీ పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం మెనూ లో గల వివిధ రకాల వంటకాల గురించి చెఫ్ లను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆక్వా ఉత్పత్తులు మరియు సముద్ర మత్య సంపద ఉత్పత్తులు ఘననీయంగా పెరుగుతున్నా యన్నారు. భారత దేశం నుండి విదేశాలకు ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తుల్లో రాష్ట్రం నుంచే 30 శాతం మేర ఎగుమతి అవుతున్నా యన్నారు. అయితే రాష్ట్ర తలసరి చేపలు, రొయ్యలు వినియోగం సంవత్సరానికి 8 కిలోలుగా మాత్రమే ఉన్నదన్నారు. ఇది దేశంలోని తలసరి వినియోగం కంటే చాలా తక్కువన్నారు. రాష్ట్రంలో వినియోగదారుల అవసరానికి అనుగుణంగా చేపలు రొయ్యలు ఉత్పతులు అందుబాటులో లేకపోవుట ముఖ్య కారణమని పేర్కొన్నారు. . వినియోగదారుల అవసరాలుకు, అభిరుచులకు అనుగుణంగా ఆక్వా ఉత్పత్తులు మరియు సముద్ర ఉత్పత్తులు అందుబాటు లోనికి తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా డొమెస్టిక్ మార్కెటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రోత్సాహిస్తూ అమలు లోనికి తీసుకురావటం జరిగిందన్నారు. ఇందులో బాగంగా మత్స్య శాఖ, చేపల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, చేపల ఆహారపు అలవాట్లను పెంపొందించడం జరుగు తుందన్నారు. ఫిష్ ఆంధ్ర చేపల విలువ ఆధారిత యూనిట్ ను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రాజమహేంద్రవరం నగరంలో వి. ఉమామహేశ్వరికి రూ. 50 లక్షల రూపాయల విలువ గల యూనిట్ కు 60 సాతం సబ్సిడీ పై మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. డొమెస్టిక్ మార్కెటింగ్ పెంపొదించడానికి, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మరియు 60 శాతం సబ్సిడీ పై యూనిట్లను మంజూరు చేయడం జరుగు తుందని ఆసక్తి గల వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన నగరపాలక సంస్థ కమీషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో సీ ఫుడ్ రెస్టారెంట్ ఏర్పాటు వలన సీ ఫుడ్ లవర్స్ కు గొప్ప డిస్టినేషన్ అవుతుందని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం ఫిష్ ఆంధ్ర లౌంజ్ యూనిట్ కిచెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమములో జిల్లా మత్స్య అధికారి వి. కృష్ణారావు మత్స్య సహాయ సంచాలకులు షేక్.దిల్షాద్ సూపరింటెండెంట్ జయబాబు యూనిట్ లబ్దిదారులు పి. ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *